For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు (ఫోటోలు)

By Nageswara Rao
|

వాహన, ఆరోగ్య బీమా విభాగాల్లో దీర్ఘకాలిక పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఐఆర్‌డీఏ ఉంది. ప్రస్తుతం సాధారణ బీమా పాలసీ తీసుకుంటే కాల వ్వవధి ఏడాదే ఉంటోంది. ప్రతి ఏటా ప్రీమియంను చెల్లించి ఆ పాలసీని పునరుద్ధరించుకోవాలి. లేదంటే బీమా రక్షణ లేనట్లే. మనలో చాలా మంది పాలసీదారులు తెలిసో, తెలియకో తమ పాలసీలను పునరుద్ధరించుకోవడాన్ని మరిచిపోతుంటారు.

ప్రస్తుతం మార్కెట్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలకు డిమాండ్ నెలకొందని ఆయన వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ రావడంతో దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) చైర్మన్ విజయన్ తెలిపారు.

బుధవారం హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విజయన్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ బీమా రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచడంతో ఆరు విదేశీ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

ఆరోగ్య పాలసీలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో నివేదికను సమర్పించనున్నదని, ఆ తర్వాతనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశీయంగా బీమా పాలసీలు తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ స్థాయిలో ఉందని 120 కోట్ల మంది జనాభాలో కేవలం ఏడు శాతం మాత్రమే బీమా కలిగివున్నారని, ఈ పరిధిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

తక్కువ కాలంలోనే దీర్ఘకాలిక ద్విచక్ర వాహన పాలసీల అమ్మకాలు లక్ష మార్కును అందుకోవడంపై విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలు డిజిటలైజేషన్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను తగ్గించుకొని తక్కువ ప్రీమియంకే పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఆస్తులకు బీమా రక్షణ ఉందని, కానీ ఇండియాలో ఇది కేవలం 7 శాతంగా ఉందన్నారు.

 త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెంపు అనుమతి కోరుతూ కంపెనీల నుంచి అధికారికంగా ఎటువంటి దరఖాస్తులు అందలేదని, కానీ ఆరు నుంచి ఏడు కంపెనీలు ఎఫ్‌డీఐ వాటాను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో బీమా రంగంలోకి ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. జీవిత బీమా, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆరు నుంచి ఏడు విదేశీ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఆర్‌డీఏఐ చీఫ్ తెలిపారు.

 త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు

ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రవేశపెట్టిన ద్విచక్ర వాహన బీమా పథకం దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని, ప్రపంచంలో ఇలాంటి పాలసీ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని విజయన్ అన్నారు. ద్విచక్ర వాహనాలతోపాటు త్రి, నాలుగు చక్రాలు కలిగిన వాహనాలకు సైతం బీమా వసతి కల్పించాలనుకుంటున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా తెలిపారు.

English summary

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాలసీలు (ఫోటోలు) | Irdai mulling long-term health insurance products: Vijayan

The Insurance Regulatory and Development Authority of India (Irdai) is planning to develop long-term health insurance products as part of its efforts to penetrate deeper into the health insurance segment. Currently, health insurance policies are renewed annually, or for two years in some cases.
Story first published: Thursday, October 8, 2015, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X