For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లను 0.35 శాతం తగ్గించినట్లు ప్రకటించింది. దాంతో బ్యాంక్ బేస్‌రేటు 9.70 శాతం నుంచి 9.35 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఐసీఐసీఐ బ్యాంక్ గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.

తగ్గించిన వడ్డీరేట్లు అక్టోబర్ 5 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. జూలై 1, 2010 తర్వాత తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే కోటి రూపాయలకు పైగా డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో పావు శాతం కోతను విధించింది.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

వడ్డీరేట్లను తగ్గించిన జాబితాలోకి ఐసీఐసీతోపాటు మరో 7 బ్యాంకులు చేరాయి. ద్వైమాసిక సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీరేట్లను అరశాతం తగ్గించడంతో ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందిస్తున్నాయి. గురువారం వడ్డీరేట్లను తగిస్తున్నట్లు ప్రకటించినవాటిలో అలహాబాద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), యెస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా, దేనా బ్యాంక్, కర్ణాటక బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

ప్రస్తుతం ఉన్న 9.75 శాతం వడ్డీరేటును 9.50 శాతానికి తగ్గిస్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. వడ్డీరేటుని పావు శాతం తగ్గించడంతో యస్ బ్యాంక్ వడ్డీరేటు 10.25 శాతంగా ఉంది. ఎస్‌బీబీజే కూడా 0.25 శాతం తగ్గించడంతో బ్యాంక్ బేస్‌రేటు 9.70 శాతంగా నమోదైంది.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

దేనా బ్యాంక్ వడ్డీరేటు 9.70 శాతంగా నమోదైంది. దేనా బ్యాంకు మొత్తం రుణాల్లో 80 శాతం రు ణాలకు బేస్‌ రేటుతో సంబంధం ఉంటుందని, తాజాగా ఈ రేటును తగ్గించినందు వల్ల మార్జిన్లపై 0.2-0.25 శాతం ప్రభావం పడనుందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌కె తక్కర్‌ తెలిపారు.

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు)

బేస్‌రేటును 9.95 శాతం నుంచి 9.50 శాతానికి తగ్గించినట్లు అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది. కర్ణాటక బ్యాంకు వడ్డీ రేటు పావు శాతం తగ్గి 10.25 శాతంగా ఉంది. బ్యాంకులు తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 5 నుంచి అమలులోకి రానున్నాయి.

English summary

వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్ (ఫోటోలు) | ICICI Bank Also Cuts Lending Rate, EMIs To Get Cheaper

ICICI Bank has cut its base rate- the interest rate below which a bank can't lend money- by 0.35 per cent to 9.35 per cent, with effect from October 5. ICICI Bank is the country's largest private sector lender.
Story first published: Friday, October 2, 2015, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X