For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విలీనం: 12 ఏళ్ల కల ఇప్పుడు నెరవేరింది(ఫోటోలు)

By Nageswara Rao
|

కమొడిటీ మార్కెట్లో అవకతవకలు జరగకుండా చూడాలని మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్థ సెబీకి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. 60ఏళ్ల చరిత్ర గల పార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్‌ఎంసీ) సెబిలో విలీనం కావడం వల్ల ఎన్‌ఎస్‌ఈల్‌ వంటి సంస్థలపై మరింతగా పట్టు బిగించేందుకు వీలు కలుగుతుందని అన్నారు.

సోమవారం ఈ కార్యక్రమానికి హాజరైన అరుణ్ జైట్లీ ఈ విలీనం వల్ల కమొడిటీస్, ఈక్వటీ డెరివేటివ్స్ మార్కెట్లలో నియంత్రణల పరంగా మెరుగుదల కనిపిస్తుందన్నారు. సుమారు 12 ఏళ్ల నుంచి ఈ విలీనం పరిశీలనలో ఉన్నా ఎన్‌ఎస్‌ఈల్‌లో 5,700 కోట్ల రూపాయల చెల్లింపుల సంక్షోభం బయటపడి ఎందరో ఇన్వెస్టర్లు బాధితులైన నేపథ్యంలో దాన్ని త్వరితగతిన అమలులోకి తెచ్చారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎఫ్‌ఎంసీ 1953లో ఏర్పాటు కాగా సెబి 1988లో చట్టపరిధికి వెలుపలి నియంత్రణ వ్యవస్థగా ఏర్పడి 1992లో పూర్తి స్వయంప్రతిపత్తి సంస్థగా మారింది. ప్రస్తుతం దేశంలో కమోడిటీ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ కోసం మూడు జాతీయ, ఆరు ప్రాంతీయ ఎక్స్ఛేంజీలు పని చేస్తున్నాయి. వీటి టర్నోవర్‌ 2014-15లో 60 లక్షల కోట్ల రూపాయలుండగా గత ఏడాది 101 లక్షల కోట్లకు పెరిగింది.

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ భిన్న రకాల ట్రేడింగ్‌ల మధ్య బలమైన సారూప్యతలున్న కారణంగా ఈ విలీనం ఉభయ సంస్థలకు లాభదాయకం అవుతుందన్నారు. అంతేకాదు వాటి పరిధి కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

కమోడిటీ డెరివేటివ్‌ మార్కెట్‌ను నియంత్రించేందుకు సెబి సర్వసన్నద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానన్నారు. ఇది సెబీకి అదనపు బాధ్యతే అయినా రెండు దశాబ్దాలుగా ఎంతో పరిణతి సాధించిన సెబికి ఆ బాధ్యతను, సవాలును స్వీకరించగల సమర్థత ఉందని ఆయన పేర్కొన్నారు.

 సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

విశ్వాసం, సమగ్రత ఉన్న వాతావరణంలోనే మార్కెట్లు పరిణతి సాధిస్తాయని, ఇందుకు చక్కని నియంత్రణలు, పారదర్శకత అవసరమని ఆర్థికమంత్రి అన్నారు. డెరివేటివ్‌ మార్కెట్లో ఎలాంటి మతలబులు, దుర్వినియోగం లేదన్న విశ్వాసం రైతన్నలు, ఉత్పత్తిదారులు, వినియోగదారుల్లో కల్పించాలని ఆయన సెబీకి సూచించారు.

 సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

ఎన్‌ఎస్‌ఈల్‌ తరహా సంక్షోభాలు చోటు చేసుకోవడాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ స్వేచ్ఛా మార్కెట్లో ఎప్పుడైనా ఒకటి రెండు పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని, అలాంటి వాటిని సమర్థవంతంగా నిలువరించగల నియంత్రణ వ్యవస్థ మనకున్నదని జైట్లీ చెప్పారు.

 సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

సెబిలో ఎఫ్‌ఎంసీ విలీనం

ఇక సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా మాట్లాడుతూ కమోడిటీ మార్కెట్లో విశ్వాసం పెంచడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ మార్కెట్లో పాల్గొనడానికి విదేశీ ఇన్వెస్టర్లను, బ్యాంక్‌లను అనుమతించడం ద్వారా కమోడిటీ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

English summary

విలీనం: 12 ఏళ్ల కల ఇప్పుడు నెరవేరింది(ఫోటోలు) | Merger of Sebi and FMC: What it means for market, players

A little over two years after Jignesh Shah and Financial Technologies promoted National Spot Exchange Limited (NSEL) suspended trading of all its contracts, resulting in a payments crisis amounting to over Rs 5,600 crore that still remains unresolved, the Forwards Market Commission, the commodities market regulator, was merged with the Securities and Exchange Board of India on Monday.
Story first published: Tuesday, September 29, 2015, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X