For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా (ఫోటోలు)

By Nageswara Rao
|

ఎఎన్ఐ టెక్నాలజీస్‌కు చెందిన ఓలా ఇండియా భారత్‌లో క్యాబ్ లీజింగ్ వ్యాపారాన్ని విస్తరించనుంది. తద్వారా భారత్‌లో కొంత మంది పారిశ్రామిక వేత్తలుగా మారే అవకాశాన్ని అందిస్తున్నామని ఓలా వ్వవస్ధాపకుల్లో ఒకరు, సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు.

అయితే ఈ క్యాబ్ లీజింగ్ వ్యాపార విభాగం ఓలా ఇండియాకు అనుబంధ సంస్ధగా పనిచేస్తుందన్నారు. క్యాబ్ లీజింగ్ వ్యాపారంలో రూ. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

వ్యాపారంలో భాగంగా తొలుత రూ. 500 కోట్లు పెట్టుబడులు పెడతామని, ఆ తర్వాత నిదులు సమీకరిస్తామన్నారు. ఈ క్యాబ్ లీజింగ వ్యాపారానికి స్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజిక్ సప్లయ్‌ ఇనిషియేటివ్స్‌) రాహుల్‌ మరోలి నేతృత్వం వహించనున్నట్లు ఓలా తెలిపింది.

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లు రూ. 35 వేల రూపాయల డిపాజిట్‌తో కారును లీజుకు తీసుకోవచ్చు. అలాగే నెలవారీగా లీజు మొత్తాన్ని (సుమారు రూ. 15,000) చెల్లించటం ద్వారా మూడేళ్ల తర్వాత వాహనాన్ని సొంతం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు.
పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

ఇలా చేయడం వల్ల డ్రైవర్లు దీర్ఘకాలంలో నిలకడగా ఆదాయం సాధిస్తూనే కారుని సొంతం చేసుకునే అవకాశం ఉందన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంకా మూడు ఇతర నగరాల్లో 1000కి పైగా కార్లు ఓలా లీజుకు ఇచ్చిందన్నారు.
పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికల్లా 10000 కార్లను లీజింగ్‌ విధానం కిందకు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. అంతేకాకుండా 2016 చివరి నాటికల్లా లక్ష మంది డ్రైవర్లను ఇందులో భాగస్వాములుగా చేయాలని ఓలా భావిస్తోంది.

English summary

పోటీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారంలోకి ఓలా (ఫోటోలు) | Ola Cabs Creates Unit To Buy And Lease Cars To Drivers As Uber Steps Up Competition

India's ANI Technologies, which operates cab-hailing service Ola Cabs, has created a new unit to buy and lease cars to drivers in an effort to consolidate its leadership in the local market, as Uber Technologies prepares to invest over $1 billion in India, its biggest market outside the United States.
Story first published: Tuesday, September 15, 2015, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X