For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్ (ఫోటోలు)

By Nageswara Rao
|

ఆటోమొబైల్ కంపెనీ టయోటా మోటార్ కార్పోరేషన్ బెంగుళూరు సమీపంలో జిల్ ఇంజన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్లాంట్‌కు కంపెనీ రూ. 800 కోట్లు ఖర్చు చేయనుంది.

జపాన్‌కు చెందిన ఈ సంస్ధ మనదేశంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ ద్వారా కార్ల తయారీ, విక్రయాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. టయోటా కిర్లోస్కర్ మోటార్ బెంగుళూరు సమీపంలో 432 ఎకరాల ప్రాంగణంలో రెండు యూనిట్ల ద్వారా పలు కార్లను తయారు చేస్తోంది.

ఈ రెండు యూనిట్లకు కలిపి ప్రతి ఏటా 3.10 లక్షల కార్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. కానీ మనదేశంలో కార్ల తయారీకి అవసరమైన ఇంజిన్లను టయోటా కిర్లోస్కర్ మోటార్, ఎక్కువగా థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఇక్కడే ఇంజిన్ల తయారీకి వీలుగా ఇంజిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. భారతీయ అనుబంధ కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్ నేతృత్వంలో కాకుండా, టయోటా మోటార్ కార్పోరేషనే నేరుగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని తెలుస్తోంది.

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

హర్ష టయోటా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఎండీ నవోమీ ఇషితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కార్ల తయారీకి 70 శాతందాకా విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. దీనిని కొద్ది రోజుల్లో 85 శాతానికి చేర్చాలని కంపెనీ భావిస్తోందన్నారు. టయోటా కిర్లోస్కర్ గతేడాది భారత్‌లో 1.60 లక్షల యూనిట్లను విక్రయించింది.

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

ఇందులో మన దేశం నుంచి 9 దేశాలకు చేసిన ఎగుమతులు 20 వేల యూనిట్లు. భారత ప్యాసింజర్ కార్ల విపణిలో కంపెనీకి 5శాతంగా వాటా ఉంది. 2014 మాదిరిగానే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలు, మార్కెట్ వాటా ఆశిస్తున్నట్టు జైశంకర్ తెలిపారు.

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

తాజాగ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ 'టయోటా డ్రైవింగ్ స్కూల్'ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా స్కూళ్ల సంఖ్యను 50కి చేరుస్తామని నవోమీ ఇషి వెల్లడించారు. హైదరాబాద్‌లో టయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఫెసిలిటీని సైతం కంపెనీ ప్రారంభించింది. ఇది భారత్‌లో 6వది కాగా, డిసెంబరు నాటికి మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది.

 బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్

నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా 60 నిమిషాల్లోనే వాహనానికి సర్వీస్ చేసి కస్టమర్‌కు అప్పగించడం ఈ కేంద్రాల ప్రత్యేకత. హర్ష టయోటా యాక్సెస్ బాక్స్ పేరిట రూపొందించిన యాప్‌ను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కస్టమర్లు ఈ యాప్ సహాయంతో సర్వీస్ బుకింగ్, బీమా, ఎమర్జెన్సీ తదితర సేవలు పొందవచ్చు.

English summary

బెంగుళూరులో 800 కోట్లతో టయోటా ఇంజిన్ ప్లాంట్ (ఫోటోలు) | Toyota Motor plans engine manufacturing plant in India

Toyota Motors is considering setting up an engine manufacturing plant in India to increase its localisation level, which varies for different models.
Story first published: Friday, September 4, 2015, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X