For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్ (ఫోటోలు)

By Nageswara Rao
|

నార్వే ఆధారిత టెలినార్ గ్రూప్‌కు అనుబంధ సంస్ధ అయిన భారతదేశపు ప్రముఖ టెలికం సంస్ధ యునినార్, హువాయ్ ఇండియాతో కలిసి తమ సర్కిళ్ల పరిధిలో ఉన్న అన్ని నెట్‌వర్క్‌లను ఆధునీకరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ సర్కిల్ పరిధిలో ఉన్న 3305 బేస్ స్టేషన్‌లను అత్యాధునిక సాంకేతికతతో కూడిన పరికరాలతో భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆధునీకరించడం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా హువాయ్, యూనినార్ సంస్ధలో నిర్వహణ సేవల భాగస్వామిగా ఏర్పడింది.

ఈ డీల్ విలువ రూ.1,300 కోట్లకు పైమాటే. భారత టెలికాం రంగంలో మరియు టెలినార్ సంస్ధ ప్రస్థానంలో ఇతి అతిపెద్ద ఒప్పందం. ఈ నెట్ వర్క్ ఆధునీకరణ ద్వారా యూనినార్ మరింత నాణ్యమైన నెట్‌వర్క్, మెరుగైన వాయిస్, ఇంటర్ నెట్ సేవలను అందించడం జరుగుతుంది.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

యునినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిల్స్‌లో 2017 చివరినాటికి 24,000 సైట్స్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తామని, సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలియజేశారు.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఎంతైనా స్పీడ్‌ను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా 5,000 సైట్స్ ఆధునీకరణ పూర్తి అవుతుంది.

 యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

''దేశవ్యాప్తంగా యునినార్ చందాదారుల సంఖ్య 4.8 కోట్లు. ఇందులో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కస్టమర్లు ప్రతినెల 3-4 శాతం పెరుగుతున్నారు. 1 జీబీ డేటాను రూ.100 లోపే అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీతో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి'' అని ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ తెలిపారు.

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్

2017 నాటికి ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కాగా కంపెనీ కాల్ సెంటర్‌కు కాల్ డ్రాప్స్ ఫిర్యాదులు లేవని శ్రీనాథ్ తెలిపారు.

English summary

యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్ (ఫోటోలు) | Uninor to upgrade 3,300 base stations in Andhra circle

Telecom service provider Uninor will upgrade over 3,300 base stations in Andhra Pradesh circle, which includes Andhra Pradesh and Telangana. This will make its network ‘future ready’ even as it envisages an increase in the data usage patterns.
Story first published: Wednesday, September 2, 2015, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X