For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సార్వత్రిక సమ్మెలో మేము సైతం (ఫోటోలు)

By Nageswara Rao
|

పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి.

అయితే ఈ సమ్మెలో బ్యాంకింగ్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ యూనియన్లు సమ్మెలో పాల్గొంటుండగా ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఎన్‌ఓబీయూయూ, ఎన్‌ఓబీఓలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

రాష్ట్రంలో మొత్తం 20 వేల మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది సమ్మె బాట పట్టారు.

 సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు విధులు బహిష్కరించి బుధవారం ఆయా శాఖల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు బ్యాంకింగ్ యూనియన్ నాయకుడు రాంబాబు తెలిపారు.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సమ్మెలో ఎస్‌బీఐ అధికారులు,ఉద్యోగులు పాల్గొనడం లేదని ఏఐబీఓసీ నాయకులు ఎంవీఎస్‌ఆర్ శర్మ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంకులు యదావిధిగా పని చేస్తాయని ఆయన వెల్లడించారు.

 సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

బంద్‌తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

సార్వత్రిక సమ్మెలో మేము సైతం

ఇక తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే, లారీ, ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. సమ్మెకు రహదారి రవాణాసంస్థ, రైల్వే, ఆటో, లారీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.

English summary

సార్వత్రిక సమ్మెలో మేము సైతం (ఫోటోలు) | Banks, insurance unions to strike work on September 2

Employees of public sector banks and government-owned non-life insurance companies would go on strike on Wednesday to protest against the anti-trade union and worker policies of the central government, union leaders said on Tuesday.
Story first published: Wednesday, September 2, 2015, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X