For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

By Nageswara Rao
|

టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికాకు చెందిన డేటా విశ్లేషణ సంస్ధ ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారో సంస్ధ వెల్లడించలేదు. ఇప్పటికే సంస్ధలో భాగస్వామిగా ఉన్న నిఖిల్ వోరా (సిక్త్స్ సెన్స్ వెంచర్స్)తో పాటు, సిలికాన్ వ్యాలీ, భారత్‌కు చెందిన పలువురు పెట్టుబడిదారులు అదనపు పెట్టుబడులు పెట్టినట్టు కంపెనీ తెలిపింది.

వీటిని నియామకాలు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు తెలిపింది. వ్యాపార కార్యకలాపాలు విస్తరించడంతో పాటు, కొత్త విభాగాల్లోకి అడుగు పెట్టేందుకు తాము ఈ నిధులు ఉపయోగించుకుంటామని ఇన్ఫినైట్ అనలిటిక్స్‌ సహ వ్వవస్ధాపకుడు, సీఈఓ ఆకాశ్ భాటియా అన్నారు.

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

డేటా విశ్లేషణలో శక్తివంతమైన సంస్ధగా ఎదగాడినికి రతన్ టాటా అపార అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌ను 2012లో స్ధాపించారు.

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

రతన్‌టాటా తన వ్యక్తిగత హోదాలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశారు. ఇటీవల కాలంలో ఈ కామర్స్‌ నుంచి కాబ్‌ అగ్రిగేటర్ల వరకు వివిధ విభాగాలకు చెందిన స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఇప్పటివరకు ఆయన స్నాప్‌డీల్‌, కార్యా, అర్బన్‌ లాడర్‌, బ్లూస్టోన్‌, కార్‌దేఖో, షామి, ఓలా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేశారు. 2012లో ప్రారంభమైన ఇన్‌ఫినిట్‌ అనలిటిక్స్‌ కస్టమర్లలో టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా రిటైల్‌, టాటా మార్కెట్‌ప్లేస్‌ ఉన్నాయి.

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి

ఫ్యూచర్‌ గ్రూప్‌, ఇబే, ఎన్‌డిటివి రిటైల్‌, కామ్‌కాస్ట్‌ లాంటి కంపెనీలు ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌కు కస్టమర్లలో ముఖ్యమైనవి.

English summary

ఇన్ఫినైట్ అనలిటిక్స్‌‌లో రతన్ టాటా పెట్టుబడి | Ratan Tata backs Infinite Analytics, a predictive analytics company built from MIT

Infinite Analytics, a company out of MIT has announced a fund raise from Ratan Tata to expand its predictive analytics technology to verticals beyond retail and e-commerce.
Story first published: Tuesday, September 1, 2015, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X