For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో త్వరలో రూ. 125 నాణెం..!

By Nageswara Rao
|

భారత్‌లో 125 రూపాయల నాణాలు చలామణిలోకి రానున్నాయి. భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, రూ. 125 నాణాలను తయారు చేసి విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఏప్రిల్ 14, 1891న అంబేద్కర్ జన్మించారు. ఆయన 125వ జయంతి వేడుకలను 2016లో ఘనంగా జరపాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పొడవునా ఆయనను గుర్తు చేసుకునే కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

Rs 125 coin to mark Bhim Rao Ambedkar’s 125th birth anniversary

అంబేద్కర్‌కు ఘన నివాళి అందించేందుకు భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 125 నాణాలను తయారు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణెం ఎలా ఉండాలన్న విషయమై సాంఘిక సంక్షేమ శాఖతో చర్చిస్తున్నారు.

అంబేద్కర్ బొమ్మ, రూపాయి చిహ్నం, మూడు సింహాల ముద్ర ఉంటాయని సమాచారం. దీంతో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంపునూ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

English summary

భారత్‌లో త్వరలో రూ. 125 నాణెం..! | Rs 125 coin to mark Bhim Rao Ambedkar’s 125th birth anniversary

The government is likely to come out with a "coin of Rs 125" to commemorate the birth anniversary of Bhim Rao Ambedkar. The idea of a coin with an unusual value is to pay tribute to the architect of the Constitution and radical social reformer on his 125th birth anniversary.
Story first published: Saturday, August 29, 2015, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X