For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విమాన ప్రయాణం భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

By Nageswara Rao
|

విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఇందుకు కారణం విమాన టిక్కెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం భావించడమే. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ సుంకం నిధులతో ఈశాన్య రాష్ట్రాల వంటి మారుమూల ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు విమాన సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం దీనిపై చర్చలు తుది దశలో ఉన్నాయి. దేశంలో విమానయానానికి కొత్త రూపు ఇవ్వడంతో పాటు నష్టాలున్నా, ఈశాన్య రాష్ట్రాలకు సైతం రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడపాలని ప్రభుత్వం భావిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

 విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమానయాన రంగం అభివృద్ధికి దీర్ఘకాల వ్యూహాన్ని ఈ విధానం అందిస్తుందని వివరించారు. రద్దీ సీజన్‌లు, సమయాల్లో విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ల ధరలు నిర్ణయించడాన్ని సైతం నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

దీనిపై ప్రధాని మోడీ సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ ఈ విషయం చెప్పారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

దీని వలన మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని ప్రధాని చెప్పినట్టు తెలిపారు. ఇందుకోసం మూడు విధానాలు పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. విమానయాన సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని, పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని చెప్పడం అందులో ఒకటి.

 విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డిజిసిఎ) ద్వారా టికెట్ల ధర నిర్ణయించడం రెండోది. అప్పటికీ కంపెనీలు దారికి రాకపోతే ప్రభుత్వ రంగంలోని ఎయిర్‌ ఇండియా ఛార్జీల ఆధారంగా టికెట్ల ధరలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ విమాన సంస్థలు విదేశాలకు విమానాలు నడపడంపై ఉన్న నిబంధనలు మార్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్‌పై 2 శాతం సుంకం

గురువారం పౌర విమానయానంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ కొత్త విధానంతో దేశంలో పర్యాటక పరిశ్రమ సైతం ఊపందుకుంటుందన్నారు. విమానాల ద్వారా సరుకులు, ప్రయాణికుల రవాణాకు ప్రాంతీయ స్థాయిలో మన దేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు.

English summary

విమాన ప్రయాణం భారం: టికెట్‌పై 2 శాతం సుంకం | Flight tickets may cost more as government mulls cess on airfares

The government is planning to impose a cess of 2 per cent on air tickets in the new civil aviation policy. The money will be utilised for viability gap funding of domestic carriers operating flights to regional and remote areas, such as the Northeast, said sources.
Story first published: Friday, August 28, 2015, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X