For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..!

By Nageswara Rao
|

చైనా ఆర్ధిక సంక్షోభం భారత ఐటీ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని నాస్కామ్ ఛైర్మన్, సైయెంట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బివిఆర్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాకు భారత ఐటీ ఎగుతమతులు చాలా తక్కువని చెప్పారు.

అందుకే చైనా ఆర్ధిక సంక్షోభం భారత ఐటీ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం ఒక్కటే పరిశ్రమకు కాస్తంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ఐటీ పరిశ్రమ సుస్థిర అభివృద్ధికి డాలర్‌తో రూపాయి మారకం రేటు స్థిరంగా ఉండడం అత్యంత అవసరం అన్నారు.

డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం వలన దిగుమతులు మరింత భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఒడిదొడుకులను అదుపు చేసేందుకు ప్రభుత్వం, ఆర్‌‌బీఐ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.

హెచ్‌1-బి వీసాలపై కూడా ఆయన స్పందించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపించే ప్రతిసారి అక్కడి రాజకీయ నాయకులు ఓట్లు కోసమే హెచ్‌1-బి వీసాలపై ఆందోళన వ్యక్తం చేయడం మామూలేనని ఆయన అన్నారు. హెచ్‌1-బి వీసాల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆరోపణలను తోసిపుచ్చారు.

నిజం చెప్పాలంటే భారత ఐటీ కంపెనీలే అమెరికాలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించాయని ఆయన తెలిపారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా భారత ఐటి రంగం దేశంలో 2.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.

English summary

భారత ఐటీ రంగంపై చైనా సంక్షోభ ప్రభావం..! | China effect on it sector

China effect on it sector.
Story first published: Thursday, August 27, 2015, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X