For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

By Nageswara Rao
|

చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ 'ముద్రా' పేరుతో రూపే డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్డులో లోడ్‌ చేసే మొత్తాన్ని వినియోగించుకునేందుకు వీలుంటుందని ఈ కార్డును విడుదల చేసిన బ్యాంకు సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌కె కల్రా చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షలలోపు రుణాలను బ్యాంకులు మంజారు చేయనున్నాయి. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు సుబ్బారావుతో కలిసి ముద్రా రుపే కార్డును విడుదల చేశారు.

 ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

ఈ సందర్భంగా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌కె కల్రా మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు పిఎంఎంవై కింద 10 లక్షల రూపాయల వరకు రుణాలను ఎలాంటి కొల్లేటరల్‌ లేకుండా మంజూరు చేస్తామన్నారు.

 ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

రూ. 50వేలు, రూ. 5 లక్షలు, రూ. 10 ల క్షలు విభాగాల్లో మొత్తం మూడు రకాల కార్డులను జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సంస్థలు వర్కింగ్‌ కాపిటల్‌ అవసరాల కోసం చెక్కులు పట్టుకుని తరచూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ కార్డులో సొమ్ము లోడ్‌ చేసి ఇస్తామన్నారు.

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

దాన్ని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ తమ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని ఆయన అన్నారు. పిఎంఎంవై కింద రుణాలు మూడు వర్గీకరణల్లో ఆయా సంస్థల అవసరాలను బట్టి అందిస్తామని, గరిష్ఠ రుణం 10 లక్షల రూపాయలని ఆయన చెప్పారు.

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..!

పిఎంఎంవై కింద ఈ ఏడాది ఎంత రుణం బట్వాడా చేయాలన్న లక్ష్యాన్ని ఇంకా ఆర్థిక శాఖ తమకు నిర్దేశించలేదని, సుమారు 15 నుంచి 16 వేల కోట్ల రూపాయల లక్ష్యం నిర్దేశించే ఆస్కారం ఉన్నదని కల్రా తెలిపారు. పిఎంఎంవై కింద ఈ ఏడాది లక్ష కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించామని, అందులో పిఎస్‌యు బ్యాంకులన్నింటికీ నిర్దేశించిన వాటా 72 వేల కోట్ల రూపాయలని సుబ్బారావు తెలిపారు.

English summary

ఆంధ్రా బ్యాంకు 'ముద్రా' కార్డు, ప్రత్యేకతలివే..! | Andhra Bank launches Mudra Card

Andhra Bank has launched Mudra Card under the Pradhan Mantri MUDRA Yojana Scheme. As part of the PMMY, the bank is issuing Mudra Card to all eligible borrowers availing working capital limits as per guidelines.
Story first published: Thursday, August 27, 2015, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X