For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్ (ఫోటోలు)

By Nageswara Rao
|

ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ప్రకటన వస్తుందని భావించిన మార్కెట్ వర్గాలకు, ప్రజలకు నిరాశే మిగిలింది. మంగళవారం జరిగిన మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు.

కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. రెపోరేటు 7.25, రివర్స్‌ రెపోరేటును యథాతథంగా ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఏ మాత్రం అవకాశం లభించినా భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గిస్తామని రఘరాం రాజన్ పేర్కొన్నారు.

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వం, పురోగతి ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోందని, 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

 వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం వద్దే యథాతథంగా ఉంచినట్లు తెలిపారు. జనవరి నుంచి వడ్డీరేట్లు 0.75శాతం తగ్గించినట్టు తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపులో బ్యాంకులు 0.3 శాతం మాత్రమే బ్యాంకు ఖాతాదారులకు బదిలాయించామని వివరించారు.

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి బ్యాంకుల ద్వారా వచ్చే అదనపు మూలధనం వృద్ధికి దోహదం చేస్తుందని, మార్కెట్‌లో డబ్బు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ నిర్ణయం మార్కెట్ వర్గాలకు పెద్దగా రుచించలేదు.

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్

ఉదయం 12 గంటల సమయంలో సెన్సెక్స్ సూచి క్రితం ముగింపుతో పోలిస్తే 119 పాయింట్లు నష్టపోయి 28,067 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

English summary

వడ్డీ రేట్లు యథాతథం: నష్టాల్లో సెన్సెక్స్ (ఫోటోలు) | RBI Holds Interest Rates Steady; CRR Unchanged

The Reserve Bank of India (RBI) today held repo rates (rates at which RBI lends money to banks) steady, as CPI inflation continued to worry the Central Bank.
Story first published: Tuesday, August 4, 2015, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X