For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

By Nageswara Rao
|

దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ రాబోయే రోజుల్లో యువత అభిరుచులకు అనుగుణంగా కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందు కోసం అవసరమైన పరిశోధన కోసం ఆర్‌ అండ్‌ డి విభాగాన్ని పటిష్ఠం చేస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌2లో వరుణ్‌ మోటార్స్‌ సారథ్యంలోని నెక్సా షోరూమ్‌ను, కావూరి హిల్స్‌లో సాబూ ఆర్‌కెఎస్‌ మోటార్స్‌ సారథ్యంలో నెక్సా జూబ్లీషోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సి మీడియాతో మాట్లాడుతూ మధ్యతరగతికి అందుబాటులో ఉండే కార్లను, విలాసాన్ని, దర్పాన్ని కోరుకునే ఆధునిక తరం యువత, సంపన్నుల అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

ఇందులో భాగంగా తమ తొలి ప్రయత్నంగా ఈ నెక్సా షోరూమ్‌లని ప్రారంభిస్తున్నామన్నారు. కొత్త ఉత్పత్తులు, ఇంధన సామర్థ్యం గల ఇంజన్లపై పరిశోధన చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది తమ సంస్థ ఆర్‌ అండ్‌ డి పటిష్ఠతతోపాటు ప్లాంట్ల సామర్థ్యాల విస్తరణ, ఇతర కార్యకలాపాలపై 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్సి చెప్పారు.

 నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

హర్యానాలోని రోహ్‌తక్‌లోని తమ ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ 2017నాటికి పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తుందని అన్నారు. మెరుగైన ఇంధన సామర్థ్యం గల కార్లపై అక్కడ ప్రత్యేక పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుతి సుజికీ ఆర్‌ అండ్‌ డి విభాగంలో 1500 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారని చెప్పారు.

 నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

ఆగస్టు 5న మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్న ఎస్‌క్రాస్‌ ఒక ప్రత్యేకతను చాటుతుందని అన్నారు. 2020నాటికి ఏడాదికి 20 లక్షల కార్లను విక్రయించాలన్నది తమ లక్ష్యమని, అందులో భాగంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పలు కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800

అక్టోబర్‌ నెలలో స్విఫ్ట్‌, డిజైర్‌ కొత్త వేరియెంట్లు మార్కెట్లోకి రానున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ నాటికి మార్కెట్లోకి మారుతి సుజికీ ఆల్టో 800 డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. గతేడాది తాము 11.7 లక్షల కార్లను విక్రయించామంటూ ఈ ఏడాది మొత్తం కార్ల మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు.

English summary

నెక్సా షోరూమ్: డీజిల్ ఇంజన్‌తో ఆల్టో 800 | Maruti Suzuki Alto 800 to Receive Diesel Engine; May Launch by December

According to Autocar Professional, Maruti Suzuki will launch the Alto 800 facelift in December this year. The new model will not only offer improved fuel-efficiency, but will also add a diesel engine to its line-up.
Story first published: Saturday, August 1, 2015, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X