For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు(ఫోటోలు)

By Nageswara Rao
|

భారత్‌లో హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బంగారు ఆభరణాల్లో సైతం నాణ్యతతో తేడాలున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) ఆందోళన వ్యక్తంచేసింది. బంగారం స్వచ్ఛతలో తేడాలున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది.

ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారు ఆభరణాల ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో 40 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలంటే హాల్‌మార్కింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరచుకోవాలని పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీం విజయవంతం కావాలంటే ఇది ఎంతో కీలకమని నివేదికలో తెలిపింది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశమైన భారత్‌లో బంగారు ఆభరణ నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్‌లో బంగారం స్వచ్ఛత ప్రమాణాలను తెలిపే హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను వినియోగదారుల వ్యవహారాల శాఖలో భాగమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

హాల్‌ మార్కింగ్ అన్నది ప్రస్తుతం తప్పనిసరి. దేశీయంగా 30 శాతం ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ఉన్నా, వాటి నాణ్యత, కొన్ని హాల్‌మార్కింగ్ సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉంటున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది.

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

నాణ్యత నియంత్రణ, పాలసీల అమలుకోసం బీఐఎస్‌వద్ద తగినంత వనరులు లేకపోవడంతో హాల్‌మార్కింగ్ స్వచ్ఛతలోనూ తేడాలుంటున్నట్లు డబ్ల్యూజీసీ డియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు.

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

ఇక హాల్‌మార్కింగ్ సెంటర్లు సైతం మౌలిక సదుపాయాల కొరత, తక్కువ లాభదాయకత లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దేశీయంగా బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాలు 220 ఉన్నాయి.

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి హాల్‌మార్కింగ్‌పై పెద్దగా అవగాహన లేకపోవడం బంగారు ఆభరణాల అమ్మకందారులకు కలిసొస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో బంగారం హాల్‌మార్కింగ్ వల్ల ప్రయోజనాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

English summary

హాల్‌మార్క్ ఉన్నా ఆభరణాలకు స్వచ్ఛత లేదు(ఫోటోలు) | Only 30 Per cent Of Gold jewellery Is Hallmarked In India: WGC

India needs improvements in the hallmarking system which is essential to a successful gold monetisation scheme, the World Gold Council (WGC) said in its latest report.
Story first published: Friday, July 31, 2015, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X