For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యందాయ్‌కు రూ. 420 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

By Nageswara Rao
|

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌కు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 420 కోట్ల జరిమానా విధించింది. ఈ డబ్బును 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హ్యుందాయ్‌కు ఈ జరిమానా విధించడానికి గల కారణం బహిరంగ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ లభించేలా చూడకపోవడమే.

మూడు సంవత్సరాల టర్నోవర్‌పై సరాసరి చూసి రెండు శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్లు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే గతేడాది ఆగస్టులో 14 కార్ల తయారీ కంపెనీలపై మొత్తం రూ. 2,554 కోట్ల జరిమానాను సీసీఐ విధించగా, వీటిల్లో చాలా కంపెనీలు కోర్టులను ఆశ్రయించి జరిమానా ఆదేశాలపై స్టే తెచ్చుకున్నాయి.

CCI imposes Rs 420 cr penalty on Hyundai; Reva, Premier also face flak

విచారణలో భాగంగా గతంలో జారీ చేసిన స్టేలను ఎత్తివేసిన కోర్టు సీసీఐ చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని సూచించాయి. గతంలో టాటా మోటార్స్ పై రూ. 1,346 కోట్లు, మారుతి సుజుకిపై రూ. 471 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

కారు విడిభాగాలను మార్కెట్లో లభించకుండా చేసి, 28 నుంచి 644 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సీసీఐ విచారణలో వెల్లడైంది.

English summary

హ్యందాయ్‌కు రూ. 420 కోట్ల జరిమానా విధించిన సీసీఐ | CCI imposes Rs 420 cr penalty on Hyundai; Reva, Premier also face flak

Coming down hard on carmakers found to be restricting sale of spare parts in open market, fair trade regulator CCI on Tuesday imposed a penalty of Rs 420.26 crore on Hyundai Motor India and asked two others-Reva and Premier-to 'cease and desist' from anti-competitive practices.
Story first published: Thursday, July 30, 2015, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X