For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

By Nageswara Rao
|

ముంబై: ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సహారాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూప్‌నకు చెందిన మ్యూచువల్ ఫండ్ లైసెన్స్‌ను మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ మంగళవారం రద్దు చేసింది. వ్యాపారం చేయడానికి సంస్థ ‘ఫిట్‌ ఆండ్‌ ప్రాపర్‌' (సరైనది) కాదని, ఆపరేషన్లను మరో ఫండ్ హౌస్‌కు బదిలీ చేయాలని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.

ఈ మేరకు 22 పేజీల ఉత్తర్వును వెలువరించింది. ఇటీవలే సహారా గ్రూప్‌నకు చెందిన పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ లైసెన్సును సెబి రద్దు చేసిన సంగతి తెలిసిందే. సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్ధలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ. 24వేల కోట్లు సమీకరించింది.

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

వాటిని తిరిగి చెల్లించడంలో వైఫల్యమవడం, కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆ సంస్ధ చీఫ్ సుబ్రతోరాయ్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుబ్రతోరాయ్‌కు బెయిల్ ఇచ్చేందుకు రూ. 10,000కోట్లు పూచీ కత్తుగా చెల్లించాలని సుప్రీం కోర్టు షరతు విధించింది. అయినా సరే ఇప్పటికీ ఆ సంస్ధ వాటిని చెల్లించలేదు.

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

తన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. ఇప్పటికే సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల నుంచి కానీ, కొత్త ఇన్వెస్టర్ల నుంచి కానీ ఇకపై కొత్త పెట్టుబడులను స్వీకరించకూడదని సెబీ పేర్కొంది.

 సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

దీంతో పాటు సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పోరేషన్ (సహారా స్పాన్సర్), సహారా అసెట్ మెనేజ్‌మెంట్ కంపెనీల (సహారా ఏఎంసీ) కార్యకలాపాలను వీలైనంత త్వరగా బదలాయించాలని సహారా ఎంఎఫ్‌ను సెబీ ఆదేశించింది.

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు

ఈ క్రమంలో సెబి తాజా గా సహారా ఎంఎఫ్‌ రిజిస్ర్టేషన్‌ లైసెన్సును రద్దు చేస్తూ, కార్యకలాపాలను వేరే ఫండ్‌ హౌస్‌కు అప్పగించేందుకు వీలుగా ఆరునెలల గడువు ఇచ్చింది. ఈ ఆరు నెలల్లో ఎంఎఫ్‌ మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని ఎంఎఫ్‌ ట్రస్డీలను కోరింది.

English summary

సహారాకు మరో ఎదురుదెబ్బ: ఎంఎఫ్ లైసెన్సు రద్దు | Sebi cancels Sahara's mutual fund licence

In a fresh crackdown on Saharas, regulator Sebi on Tuesday cancelled the registration of Sahara Mutual Fund saying it was no longer 'fit and proper' to carry out this business and ordered transfer of its operations to another fund house.
Story first published: Wednesday, July 29, 2015, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X