For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'మిసైల్ మ్యాన్‌'కు కార్పోరేట్ ఘన నివాళి: ఎవరేమన్నారు?

By Nageswara Rao
|

భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్‌గా పేరుగాంచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మృతికి దేశీయ కార్పోరేట్ రంగం తీవ్ర సంతాపం తెలియజేసింది. దేశం ఒక దార్శినికున్ని, పెద్దదిక్కుని కోల్పోయిందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఆయన మరణం దేశానికి తీరనిలోటని వారంతా పేర్కొన్నారు. చరిత్రలో ఒక అధ్యయాన్ని లిఖించి, ధ్రువతారలా నింగికెగసిన మానవ మూర్తికి పారిశ్రామికవేత్తలు అశ్రు నివాళులర్పించారు. అబ్దుల్ కలాం మృతిపై ఎవరేమన్నారు...

ఆయనే స్ఫూర్తి: సుమిత్‌ మజుందార్‌, సిఐఐ ప్రెసిడెంట్‌

ఆయనే స్ఫూర్తి: సుమిత్‌ మజుందార్‌, సిఐఐ ప్రెసిడెంట్‌

దేశ పురోగమనానికి, పారిశ్రామిక ప్రగతికి ఎపిజె అబ్దుల్‌ కలాం ఇచ్చిన నిరంతర స్ఫూర్తి అసామాన్యమైనది. ఆర్థికంగా, సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా భారత్‌ అగ్రరాజ్యంగా నిలబడాలనే ఆయన తపన నుంచి స్ఫూర్తి పొందడంవల్లనే, పోటీలో దూసుకుపోయేందుకు దేశీయ పరిశ్రమలు టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవడం మొదలుపెట్టాయి.

 ఈంఆర్‌ఐకి ప్రోత్సాహం: జివికె రెడ్డి గ్రూప్‌ చైర్మన్‌

ఈంఆర్‌ఐకి ప్రోత్సాహం: జివికె రెడ్డి గ్రూప్‌ చైర్మన్‌

జివికె ఈంఆర్‌ఐ చైర్మన్‌ ఎమిరిటస్‌గా వ్యవహరిస్తూ భారతరత్న డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం, సంస్థలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారు. ప్రజల ప్రాణ రక్షణకు సంబంధించిన సర్వీసుల్లో టెక్నాలజీ వినియోగాన్ని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. 108 ఈంఆర్‌ఐ సర్వీసులను అన్ని సార్క్‌ దేశాల్లోనూ ప్రవేశపెట్టాలన్నది కలాం ఆకాంక్ష. ఈశాన్య రాష్ట్రాలకు 108 సర్వీసుల విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.

 పూడ్చలేని లోటు: ఆలోక్‌ బి శ్రీరామ్‌ ప్రెసిడెంట్‌, పిహెచ్‌డి చాంబర్‌

పూడ్చలేని లోటు: ఆలోక్‌ బి శ్రీరామ్‌ ప్రెసిడెంట్‌, పిహెచ్‌డి చాంబర్‌

అబ్దుల్‌ కలాం వంటి స్ఫూర్తి ప్రదాతలైన నేతలు అరుదు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీని పూడ్చటం సాధ్యం కాదు. దేశాధ్యక్షనిగా ఆయన పారిశ్రామిక రంగంతో సహా అ న్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నా రు. దేశ ఆర్థిక, విజ్ఞాన శాస్త్ర ప్రగతికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించిన ఆయన ఆ లోచనలు, ఆశయాల వల్ల పారిశ్రామిక రంగం ఆయనపై అపరిమిత గౌరవాన్ని పెంచుకుంది.

 మరుపురాని మనిషి: ఆనంద్‌ మహీంద్రా, సిఎండి, ఎంఅండ్‌ఎం

మరుపురాని మనిషి: ఆనంద్‌ మహీంద్రా, సిఎండి, ఎంఅండ్‌ఎం

మహీంద్రా గ్రూప్‌ సంస్థ చెన్నై రీసెర్స్‌ వ్యాలీ ప్రారంభోత్సవం సందర్భంగా కలాంతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. ఎప్పుడూ సమున్నతంగా ఆలోచించాలనీ, ఒరిజినల్‌ ఆలోచనల పరిమితిని అధిగమించి ముందుకు చూడాలని సలహా ఇచ్చేవారు.

 ఈ ఘనత ఆయనదే..: ఇఇపిసి చైర్మన్‌ అనుపమ్‌ షా

ఈ ఘనత ఆయనదే..: ఇఇపిసి చైర్మన్‌ అనుపమ్‌ షా

చౌకరకం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు పరిమితమైన భారత్‌ను అత్యాధునిక, హైఎండ్‌ ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల ఎగుమతి దిశగా ప్రోత్సహించడంతో పాటు అందుకు అవసరమైన స్పూర్థినిచ్చిన నేత అబ్దుల్ కలాం. ఆయనవంటి వారి ప్రోత్సాహం వల్లనే ఏవియేషన్‌, రైల్వేలు, షిప్‌ బిల్డింగ్‌ రంగాలకు అసరమైన హైఎండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్‌ ఎగుమతి చేస్తోంది.

 భరతమాత గొప్ప పుత్రుణ్ని కోల్పోయింది: అపోలో గ్రూప్ ఛైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి

భరతమాత గొప్ప పుత్రుణ్ని కోల్పోయింది: అపోలో గ్రూప్ ఛైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి

భరతమాత గొప్ప పుత్రుణ్ని కోల్పోయింది. దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి, ప్రజలకు సేవలు చేయడానికి ఆయన తన జీవితాన్నే అంకితం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశాన్ని ఉన్నత స్ధాయికి చేర్చడానికి ఆయన చేసిన కృషి అసమానం

స్పూర్తిదాయకం: మైక్సోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

స్పూర్తిదాయకం: మైక్సోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

మీ విలువైన బోధనలు, నాయకత్వం, మానవత్వపు పరిమళాలు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం.

English summary

'మిసైల్ మ్యాన్‌'కు కార్పోరేట్ ఘన నివాళి: ఎవరేమన్నారు? | Indian Corporates tribute to abdul kalam

Indian Corporates tribute to abdul kalam
Story first published: Wednesday, July 29, 2015, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X