For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముంబై కంపెనీ చేతికి ప్రపంచపు అతి పెద్ద గోల్డ్ రిఫైనరీ

By Nageswara Rao
|

ముంబైకిచెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 2,540 కోట్లు). ఈ డీల్‌తో తమ కంపెనీ ప్రతిష్ట మరింతగా పెరగనుందని కంపెనీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం సరఫరా కంపెనీలను పరిశీలించిన మీదట న్యూమాంట్ మైనింగ్ కార్పోరేషన్‌కు చెందిన వాల్కాంబీని ఎంచుకున్నామని కంపెనీ ఛైర్మన్ రాజేష్ మెహతా తెలిపారు. వాల్కాంబీ కంపెనీ ముడి బంగారం, బంగారు నగల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

ముంబైకిచెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 2,540 కోట్లు).

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

ఈ ఒప్పందంతో తమ కంపెనీ గ్లోబల్ గోల్డ్ బిజినెస్‌లో ముందుకెళడంతో పాటు, కంపెనీ లాభాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రపంచంలో బంగారాని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొదటి స్ధానంలో ఉండగా, భారత్ రెండో స్ధానంలో ఉంది.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

భారత్‌లో ఏడాదికి సుమారు 900 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ. 90 పెరిగి బంగారం ధర రూ.25,490కి చేరింది.

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

అతి పెద్ద బంగారం రిఫైనరీ కంపెనీ కొనుగోలు

అదే విధంగా రూ.150 పెరిగి కేజీ వెండి ధర రూ.34,200కి చేరింది. ప్రపంచ బులియన్‌ మార్కెట్లు ప్రభావం, నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలు కొనుగోళ్లు చేపట్టడం తదితర కారణాల వల్ల ఈ లోహాల ధరలు పెరిగాయని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

English summary

ముంబై కంపెనీ చేతికి ప్రపంచపు అతి పెద్ద గోల్డ్ రిఫైనరీ | Rajesh Exports Acquires Valcambi - World’s Largest Gold Refinery

Rajesh Exports on Monday said that the company through it's wholly owned subsidiary in Singapore has fully acquired European Gold Refineries.
Story first published: Monday, July 27, 2015, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X