For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం? (ఫోటోలు)

By Nageswara Rao
|

గ్రీసు ఆర్ధిక సంక్షోభ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉటుందని, అందుకు కారణం మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటమేనని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.

బెయిలవుట్ ప్యాకేజీ షరతులను గ్రీస్ ప్రజలు రిఫరెండంలో 'నో' చెప్పిన నేపథ్యంలో అక్కడ సంక్షోభం మరింత తీవ్రతరం అవడం, యూరోజోన్‌ నుంచి గ్రీస్ బయటకు రానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంతో అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ గ్రీస్ సంక్షోభం నుంచి మనకు మూడు విధాలుగా రక్షణ ఉంటుందన్నారు. ఈ ప్రతికూలతలను తట్టుకోగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు.

ఎందుకంటే దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు అత్యంత స్థిరంగా ఉన్నాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు కూడా ఉండటంతోపాటు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు.

 గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

అయితే రూపాయి మారకపు విలువపై మాత్రం ఆ ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అసాధారణ పరిస్ధితులు తలెత్తలేదని స్పష్టం చేశారు.

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

ఆర్ధిక కార్యదర్శి రాజీవ్ మహర్షి మాట్లాడుతూ గ్రీస్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురయ్యే ప్రమాదం ఉందని.. దీనిపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లే తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

బెయిలవుట్ ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు ఒప్పుకోవాలంటూ యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

దీంతో గత నెల 30న అంతర్జాతీయ ద్రవ్య సంస్ధకు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి 'ఎగవేతదారు' అయింది. అధికారికంగా గ్రీస్ దివాలా తీసినట్లు యూరోపియన్ ఆర్థిక స్థిరత్వ యంత్రాంగం(ఈఎఫ్‌ఎస్‌ఎఫ్) ప్రకటించింది.

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

మరో రెండు రోజులు బ్యాంకుల మూసివేత గ్రీసు బ్యాంకుల్ని మంగళ, బుధవారాల్లో మూసివేస్తున్నట్లు గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఏటీఎంలలో 60 యూరోలను తీసుకునే అనుమతి కొనసాగుతూనే ఉంది.

 గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

రిఫరెండంపై గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ మాట్లాడారు. యూరప్ చరిత్రలో ఈ ఆదివారం ఎంతో ప్రకాశవంతమైన రోజు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేరని ఈ రిఫరెండం నిరూపించిందని అన్నారు. గ్రీస్ వాసులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం?

ఇది ఇలా ఉంటే రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు మంగళవారం యూరోజోన్ నేతలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. ఈ సదస్సుకు ముందు యూరోజోన్ ఆర్థిక మంత్రులు కూడా సమావేశం కానున్నారు.

English summary

గ్రీస్ ఆర్ధిక సంక్షోభం: భారత్‌పై ప్రభావం? (ఫోటోలు) | Rupee May Be Hit from Greece Fallout: Arvind Subramanian

With Greeks' rejection of rescue package from creditors spooking global markets, the government on Monday asserted that India is well insulated from the crisis but rupee may be affected due to the outward flight of investment.
Story first published: Tuesday, July 7, 2015, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X