For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీసులో ముగిసిన రెఫరెండం: 'నో'కే ప్రజల మద్దతు

By Nageswara Rao
|

గ్రీసు దేశ భవితవ్యాన్ని నిర్దేశించే రెఫరెండం ప్రక్రియ ముగిసింది. ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పోలింగ్‌లో లక్షలాది మంది గ్రీకు ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు. ఏథెన్స్‌లో ఓటు వేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అన్నారు.

కోటి పది లక్షల మంది ఓటు వేయడానికి వీలుగా మారుమూల ఏజియాన్ దీవులు మొదలుకొని ఇటు బల్గేరియా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల దాకా ప్రజలు ఓటు వేయడానికి వీలుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు.

ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలవద్ద బారులు తీరారు. ఐరోపా సమాజంలో కొనసాగాలా వద్దా అనే రెండు అంశాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.

దీంతో గ్రీస్ ప్రజలు యూరోపిన జోన్‌లో కొనసాగరాదనే దానికే మొగ్గు చూపుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఒపీనియన్ పోల్స్ ప్రకారం సంస్కరణలను వ్యతిరేకించిన వారే అధికమని తెలుస్తుంది.

మూడు సంస్థలు జీపీవో, మెట్రోన్ అనాలిసిస్, ఎంఆర్‌బీ పోల్ సర్వేలు విడుదల చేశాయి. సంస్కరణలకు అనుకూలం కాదు అంటున్న వర్గానికి మూడు పాయింట్ల ఆధిక్యం లభించనుందని ఈ సర్వేలు చెబుతున్నాయి.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

బెయిలవుట్ ప్యాకేజీకి యూరోపియన్ యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లు నిర్దేశించిన షరతులకు ఒప్పకోవాలా, వద్దా అన్నది తేల్చడానికి ఆదివారం గ్రీస్ ప్రభుత్వం రెఫరెండం నిర్వహించింది.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో పాటుగా బ్యాంకులు మూతపడ్డం, రోజుకు ఎటిఎంలలో 60 యూరోలకు మించి విత్‌డ్రాలు తీసుకోకూడదంటూ ఆంక్షలు విధించిన తర్వాత ఈ రెఫరెండం చోటు చేసుకుంటోంది.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

1999లో ఐరోపా సమాజం దేశాలన్నిటిలో ఒకే కరెన్సీ యూరో అమలులోకి రావడం తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రీస్ సంక్షోభం యూరోకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గ్రీస్ రెఫరెండంను ఐరోపా సమాజం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

సిప్రాస్ ప్రభుత్వం కోరినట్లుగా రెఫరెండంలో ‘నో' ఫలితం వస్తే 19 దేశాల యూరోజోన్‌నుంచి గ్రీస్ తప్పుకోవలసి వస్తుందని ఇయు దేశాల నేతలు హెచ్చరించారు. అయితే గౌరవంతో జీవించడం కోసం మాత్రమే దేశ ప్రజలు ఓటు వేస్తున్నారని సిప్రాస్ అంటూ, సోమవారం యూరప్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిఫరెండం ఓటింగ్‌లో 'నో'కు ఎక్కువ మంది మొగ్గ చూపినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో త్వరలో రుణదాతలతో డీల్ కుదర్చుకుంటామన్న విశ్వాసాన్ని గ్రీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

గ్రీసులో ముగిసిన రెఫరెండం

గ్రీసులో ముగిసిన రెఫరెండం

యూరోజోన్ నుంచి గ్రీస్ బయటకు వెళ్లడంతో పాటు, యూరో స్ధానంలో సొంత కరెన్సీ ముద్రించుకుని, 'ఎగవేతదారు'గా గ్రీస్ అవతరిస్తే, తమకు భారీ నష్టం తప్పదని జర్మనీ భయపడుతోంది. గ్రీస్‌కు ఎక్కువ మొత్తంలో రుణం ఇచ్చింది జర్మనీయే అని టెలిగ్రాఫ్‌లో కథనం ప్రచురించింది.

దీంతో గ్రీస్ మరింత ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదని ఆర్ధిక నిపుణలుు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రీస్ రిఫరెండంను గౌరవించి తీరతామని యూరోపియన్ జోన్ ప్రకటించింది.

ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదని కూడా యూరోపియన్ యూనియన్ వెల్లడించింది. యూరో జోన్ షరతులను అంగీకరించని నేపథ్యంలో గ్రీస్ బయటకు రానుంది. గ్రీస్ నిష్క్రమణ ప్రభావంతో చర్చించేందుకు యూరోపియన్ యూనియన్‌లోని మిగతా దేశాలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

English summary

గ్రీసులో ముగిసిన రెఫరెండం: 'నో'కే ప్రజల మద్దతు | Greece 'No' in referendum sends euro into tailspin

Greece's government today looked to have won a 'No' it had been seeking in a referendum on bailout terms, but the euro immediately plummeted on fears the result could splinter the eurozone.
Story first published: Monday, July 6, 2015, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X