For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 నిజాలు: హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన(ఫోటోలు)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: వివాదాస్పద సీఈఓ రాహుల్ యాదవ్‌కు రియల్ ఎస్టేట్ రంగంలో సేవలందిస్తోన్న హౌసింగ్ డాట్ కాం ఉద్వాసన పలికింది. ఇన్వెస్టర్లతోను, మీడియాతోను ఆయన వ్వవహార శైలి సీఈఓ స్ధాయికి తగ్గట్టుగా లేదని వ్యాఖ్యానించింది.

రాహుల్ యాదవ్ తీరు కంపెనీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్లు కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న రాహుల్‌ యాదవ్‌ను తొలగిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

సాధారణ బోర్డు సమావేశంలో ఆయన్ను తొలగించామని, ఇక ఉద్యోగిగా కూడా కొనసాగించకూడదని నిర్ణయించామని ఆ కంపెనీ పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇకపై రాహుల్‌కు కంపెనీతో ఎలాంటి సంబంధాలు ఉండబోవని పేర్కొంది.

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

తన ప్రవర్తనపై బోర్డు తీవ్రంగా మండిపడిందని రాహుల్‌ యాదవ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. యాదవ్‌ కాలపరిమితికి ముగింపు చెప్పాలని హౌసింగ్‌.కామ్‌ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించిందని, ఆయన వ్యవహారశైలీ పెట్టుబడిదార్లకు భిన్నంగా ఉద్యోగులు, మీడియాతో స్నేహపూర్వకంగా ఉందని ఆ కంపెనీ పేర్కొంది.

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

26 ఏళ్ల రాహుల్‌ యాదవ్‌ గత ఆరు మాసాలుగా పెట్టుబడిదార్లు, మీడియాలో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఆలోచనల ఆధారంగానే 2012లో బాంబే ఐఐటిలోని 12 మంది పట్టబద్రులు కలిసి హౌసింగ్‌.కామ్‌ను స్థాపించారు.

 హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

అలీబాబా.కామ్‌ విధానంలో కంపెనీ ఎదుగాలని ఆశిస్తున్నానని ఈ మధ్య కాలంలోనే పేర్కొన్నారు. ఇందుకోసం కొన్ని సంస్థాగత మార్పులు చేపడుతామన్నారు. ఇంతలోనే ఆయన్ను తొలగించడం ఆ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలుస్తోంది.

 హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

సంస్ధలోని తన వాటా ఈక్విటీలను ఉద్యోగులకు పంచి రాహుల్ గొప్ప ఔదర్యాన్ని ప్రదర్శించాడు. ఈ మొత్తం వాటాను 2,251 మంది తమ సిబ్బందికి, అంటే ఒక్కో ఉద్యోగికి రూ.6.50 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు చెందేలా చేశారు.

 హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

ఈ వయస్సులో తనకు డబ్బు అవసరం లేదని పేర్కొని, తన నిరాడంబరతను ప్రకటించుకున్నారు. కార్పొరేట్ రంగంలోనే పెద్ద వార్త అయింది. రాహుల్ వ్యక్తిగత షేర్ల విలువ రూ. 150 - 200 కోట్ల మధ్య ఉంటుంది. తనలాగే అందరూ చెయ్యాలంటూ, వివిధ ప్రముఖలు పేర్లను ప్రస్తావించాడు.

 హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

ఇలాంటి పరిణామాలు తమ వ్యాపారాల మనుగడను దెబ్బతీస్తాయని, తమ సిబ్బంది కూడా ఇలాంటి డిమాండ్‌లను లేవనెత్తుతారని ఆందోళనలో పడ్డాయి. ఓసారి ఇన్ఫోసిస్‌ సిఇఒ సిక్కా విమానశ్రయంలో తన పక్కనే కూర్చుకున్నప్పటికీ తనతో ఒక్క మాటా కూడా మాట్లాడాటానికి ఇష్టపడలేదని రాహుల్‌ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం తన వాటాను సిబ్బందికి పంచడం ఇతర పెట్టుబడిదా ర్లకు ఇష్టం లేదని పరోక్షంగా పేర్కొ న్నారు.

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన

రాహుల్‌ను తొలగించడంతో ఈ పోస్టుకు కొత్త నాయకున్ని వెతికే పనిలో హౌసింగ్.కామ్ పడింది. మధ్యంతర సీఈఓగా ప్రస్తుతం ఉన్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇంతకాలం రాహుల్‌ కంపెనీకి చేసిన సేవలకు బోర్డు ధన్యవాదాలు తెలిపింది.

English summary

7 నిజాలు: హౌసింగ్.డామ్ సీఈఓకు ఉద్వాసన(ఫోటోలు) | Housing.com sacks CEO Rahul Yadav: 7 top facts

Realty portal Housing.com's co-founder Rahul Yadav was sacked by its board as the CEO, blaming the step on his behaviour towards investors and media, calling his "behaviour towards investors, ecosystems and the media not befitting of a chief executive.
Story first published: Friday, July 3, 2015, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X