For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ పతనం: అరగంటలో 2 లక్షల కోట్లు నష్టం..!

By Nageswara Rao
|

గ్రీస్ సంక్షోభం ముదరడం, ఆసియా మార్కెట్ల పతనం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం భారీగా పతనమైన సెన్సెక్స్, శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 520 పాయింట్లు దిగజారి ఒత్తడి మధ్య ముందుకు సాగుతోంది.

సోమవారం 12 గంటల ప్రాంతంలో 525 పాయింట్ల నష్టంతో 27,285 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిప్టీ 165 పాయింట్ల నష్టంతో 8215 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సెక్టారీ సూచీల్లో హెల్త్ కేర్ 2.07 శాతం, ఆటో 2.22 శాతం, బ్యాంకెక్స్ 2.52 శాతం నష్టపోతున్నాయి.

గ్రీసులోని బ్యాంకులకు కొత్తగా నిధులివ్వడం నిలిపివేసిన ఈసీబీ

గ్రీస్ సంక్షోభం తాజాగా కొత్త మలుపు తిరిగింది. గ్రీస్ బ్యాంకులకు అత్యవసర ద్రవ్య సహాయం (ఈఎల్‌ఏ) కింద నిధులివ్వడం నిలిపివేసినట్లు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఆ దేశ ప్రజలు బ్యాంకుల నుంచి ఉన్నకాడికి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు.

దీంతో అక్కడి ప్రభుత్వం సొమ్ము విత్‌డ్రా, విదేశాలకు నగదు బదిలీపై పరిమితులు విధించింది. అంతేకాదు గ్రీసు సందర్శనకు వెళ్లేవారు తమవెంట సరిపడా నగదును వెంట తీసుకెళ్లాలని యూరోపిన్ దేశాలు తమ ప్రజలకు సూచించాయి.

గ్రీసుకు బెయిల్‌అవుట్ గడువును మరో ఐదు నెలలపాటు పొడిగించడంతో ఐఎంఎఫ్‌కు రుణ బకాయిలు చెల్లించేలా తక్షణమే నిధులు అందించేందుకు రుణదాతలు ముందుకొచ్చాయి. అయితే రుణదాతలు ఊహించని విధంగా వారు కోరుతున్న ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలా, వద్దా అనే విషయంపై గ్రీసు ప్రధాని అలెక్సిస్ ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నారు.

 భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దీంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2 లక్షల కోట్లకు పైగా కోల్పోయినట్లయింది. ప్రస్తుతం మార్కెట్ కోటి కోట్ల రూపాయల మార్క్ నుంచి దిగజారి రూ. 99. 76. 462 కోట్లుగా ఉంది.

 భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇక నిప్టీ టాప్ గెయినర్స్ లిస్ట్‌లో బిపిసిఎల్ 1.07 శాతం, ఐటీసీ 0.21 శాతం లాభపడుతుండగా, నిప్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో టాటా మోటార్స్ 3.28 శాతం, ఎస్‌బీఐఎన్ 3.07 శాతం, హిందాల్కో 3.03 శాతం నష్టపోతున్నాయి.

 భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద ప్రారంభ దశలో రూపాయి డాలర్‌తో పోలిస్తే 63,88 వద్ద నేడు ట్రేడింగ్ అవుతోంది.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

సోమవారం 12 గంటల ప్రాంతంలో 525 పాయింట్ల నష్టంతో 27,285 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిప్టీ 165 పాయింట్ల నష్టంతో 8215 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

English summary

భారీ పతనం: అరగంటలో 2 లక్షల కోట్లు నష్టం..! | Rupee Dives As Greece Worries Cause Mayhem

The rupee was last trading at 63.88 against the US dollar in early trade today at the Interbank Foreign Exchange.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X