For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

By Nageswara Rao
|

ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) నిబంధనల్లో మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ (సెబీ) కీలక మార్పులు చేసింది. ప్రారంభ (స్టార్టప్‌) దశలో ఉన్న కంపెనీల లిస్టింగ్‌ నిబంధనలను కూడా సరళీకృతం చేసింది. ఐపిఒ ముగిసిన 6 రోజుల్లోగా స్టాక్‌మార్కెట్లలో కంపెనీలు లిస్టింగ్ కావాల్సి ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఇది 12 రోజులుగా ఉంది.

అలాగే ఐపిఒ పెట్టుబడులను చెక్-ఫ్రీగా చేసింది. అంతేగాక మార్కెట్లు, ప్రస్తుత, కొత్త మదుపరుల నుంచి నిధుల సమీకరణ కోసం ‘ఫాస్ట్-ట్రాక్' పద్ధతిలో వెళ్లేందుకు సంస్థలను అనుమతించింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యుకె సిన్హా తెలియజేశారు.

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

సెబీ తీసుకున్న ఈ నిర్ణయాలతో దేశీ స్టార్టప్‌ కంపెనీలు నిధుల సమీకరణ కోసం, విదేశీ స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టప్‌ కంపెనీలు ఈక్విటీలో 75 శాతాన్ని తమకు నచ్చిన సంస్థాగత మదుపరులకు కేటాయించుకోవచ్చు.

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

ఈక్విటీలో ప్రమోటర్లకు 10 శాతానికి మించి వాటా లేకపోయినా ఎలాంటి ఓటింగ్‌ హక్కులు లేకుండా వారు పబ్లిక్‌ ఇన్వెస్టర్లుగా కొనసాగవచ్చు.

 సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా

సీఈఓగా ఉన్న ప్రమోటర్‌ తన వాటాను అమ్ముకున్నా కంపెనీ బోర్డు ఆమోదంతో మూడు సంవత్సరాల పాటు సీఈఓ లేదా ఇతర సీనియర్‌ హోదాలో కొనసాగేందుకు అవకాశం.

సెబీ నిర్ణయంపై స్నాప్ డీల్

సెబీ నిర్ణయంపై స్నాప్ డీల్

స్టార్టప్‌ కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించి సెబి తీసుకున్న నిర్ణయాలపై స్నాప్‌డీల్‌ హర్షం వ్యక్తం చేసింది. నిధుల సమీకరణ కోసం చూస్తున్న స్టార్టప్‌ కంపెనీలకు ఈ నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయని ఒక ప్రకటనలో తెలిపింది.

ఒకసారి లిస్టింగ్ అయిన తర్వాత కంపెనీల షేర్ల లావాదేవీల కోసం స్టాక్ ఎక్సేంజీల్లో ప్రత్యేక వ్యవస్థీకృత ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్లు, లిస్టింగ్‌కు ముందు వాటాలు తీసుకున్న ఇన్వెస్టర్లు, లిస్టింగ్‌ తర్వాత మూడు సంవత్సరాల వరకు తమ వాటాలను విక్రయించుకునే అవకాశం లేదు.

అయితే స్టార్టప్ కంపెనీల కోసం ఈ కాలపరిమితిని ఆరు నెలలకు కుదించింది. దీంతో పాటు లిస్టింగ్‌కు ముందు టెక్నాలజీ రంగానికి చెందిన స్టార్టప్‌ కంపెనీల ఈక్విటీలో సంస్థాగత మదుపరుల కనీస పెట్టుబడి 25 శాతానికి తగ్గకుండా ఉండాలని సెబి నిర్దేశించింది.

English summary

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా | Sebi makes IPOs cheque-free; unveils start-up listing norms

Ushering in a wave of technology- driven reforms, regulator Sebi allowed startups to list and raise funds with an easier set of norms within India, while it made investments cheque-free for all IPOs, reported PTI.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X