For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కంపెనీల్లో 500 ఉద్యోగాలు: వేతనం రూ. కోటి

By Nageswara Rao
|

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో ఈ కామర్స్ కంపెనీలకు లాభాలే లాభాలు. ఈ కామర్స్ కంపెనీలు మరింతగా వ్యాపారాన్ని పెంచుకునేందుకు సీనియర్ స్ధాయి ఉద్యోగులకు సంవత్సరానికి కోటి రూపాయల జీతాన్ని చెల్లించేందుకు వెనకాడటం లేదు.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, ఓలా, ఉబెర్, క్విక్కర్, యప్ మీ, ఓఎల్ఎక్స్, జంగ్లీ, హంగామా, బుక్ మై షో, జబాంగ్, క్లియర్ ట్రిప్, లెన్స్‌కార్ట్ తదితర సంస్ధలు 500 వరకూ సీనియర్ స్ధాయి ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా వేతనాన్ని ఆఫర్ చేసి విధుల్లోకి తీసుకోనున్నాయి.

ఈ విషయాన్ని ఆర్జీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లాంగ్ హౌస్ కన్సల్టింగ్‌తో పాటు మరో ఐదు సెర్చ్ సంస్ధలు విడుదల చేసిన అంచనాల్లో స్పష్టం చేశాయి. గడచిన ఆరు నెలల్లో ఈ కామర్స్ రంగంలోని 100కు పైగా కంపనీలకు చెందిన సీనియర్ స్ధాయి ఉద్యోగులతో మాట్లాడి సేకరించామని ఏబీసీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ సిద్దార్ధ రాయ్ సురానా తెలిపారు.

Flipkart, Amazon, Snapdeal, other e-commerce companies may offer 500 jobs of Rs 1 crore salaries each

ఈ కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంవత్సరానికి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు కూడా 30 నుంచి 40 శాతానికి పెరిగాయని వెల్లడించారు.

ప్రస్తుతం తమ సంస్ధలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపిన స్నాప్‌డీల్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ నిగమ్, త్వరలో బిజినెస్ మరింతగా వృద్ధి చెందేందుకు, టీమ్‌లను నడిపించే లీడర్‌షిప్‌ను నియమించనున్నట్లు పేర్కొన్నారు.

English summary

ఈ కంపెనీల్లో 500 ఉద్యోగాలు: వేతనం రూ. కోటి | Flipkart, Amazon, Snapdeal, other e-commerce companies may offer 500 jobs of Rs 1 crore salaries each

Ecommerce companies could roll out 500 jobs with salaries of more than Rs 1 crore each this year, according to estimates by five search firms including RGF Executive Search and Longhouse Consulting.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X