For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్: 100 మందిలో భారత్ నుంచి నలుగురు(ఫోటోలు)

By Nageswara Rao
|

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో భారత్‌కు చెందిన నలుగురు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన 12వ వార్షిక జాబితాలో ఎస్‌బిఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, ఐసిఐసిఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచ్చర్‌, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా, హెచ్‌టి మీడియా అధిపతి శోభనా భార్తియా చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్ధానంలో నిలిచారు. అమెరికాకు చెందిన హిల్లరి క్లింటన్ రెండో స్థానంలో నిలువగా, మూడవ స్ధానంలో మిలిండా గేట్స్ నిలిచారు. వ్యాపార రంగంలో విశేషంగా కృషి చేసినవారు, రాజకీయం, రోల్ మోడల్స్, కుబేరులు, మార్గదర్శకులతో ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసే శక్తి ఉన్న మహిళలతో ఈ నివేదికను ఫోర్బ్స్ రూపొందించింది.

 100 మందిలో భారత్ నుంచి నలుగురు

100 మందిలో భారత్ నుంచి నలుగురు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్ధానంలో నిలిచారు.

100 మందిలో భారత్ నుంచి నలుగురు

100 మందిలో భారత్ నుంచి నలుగురు

గత ఏడాదితో పోలిస్తే, అరుంధతీ భట్టాచార్య, చందాకొచ్చర్, మజుందార్ షా ముగ్గురూ తమ తమ స్ధానాలను మెరుగు పరుచుకున్నారు. గతేడాది భట్టాచార్య 36వ స్థానంలో, కొచ్చర్‌ 43వ స్థానంలో, కిరణ్‌ 92వ స్థానంలో ఉన్నారు. ఇంద్రానూయి 15వ స్థానంలో, వారియర్‌ 84వ స్థానంలో నిలిచారు.

100 మందిలో భారత్ నుంచి నలుగురు

100 మందిలో భారత్ నుంచి నలుగురు

ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలు- పెప్సికో చీఫ్‌ ఇంద్రా నూయి, సిస్కో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పద్మశ్రీ వారియర్‌ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో, చందాకొచ్చర్‌ 35వ స్థానంలో, మజుందార్‌ షా 85వ స్థానంలో, భార్టియా 93వ స్థానంలో నిలిచారు.

 100 మందిలో భారత్ నుంచి నలుగురు

100 మందిలో భారత్ నుంచి నలుగురు

ఈ 100 మందిలో 8 మంది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. 24 మంది కార్పోరేటు సంస్ధల సీఈఓలు కాగా, 18 మంది సొంతంగా సంస్ధలు, ఫౌండేషన్‌లు స్ధాపించారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి చెందిన వారు 18 మంది కాగా, లాటిన్ అమెరికా నుంచి 4గురు, ఐరోపా ప్రాంతం నుంచి 12 మంది, ఆఫ్రికా నుంచి ముగ్గురు ఈ జాబితాలో ఉన్నారు.

English summary

ఫోర్బ్స్: 100 మందిలో భారత్ నుంచి నలుగురు(ఫోటోలు) | Four Indians among Forbes 100 most powerful women, Angela Merkel tops list

Four Indian women SBI Chief Arundhati Bhattacharya, ICICI bank head Chanda Kochhar, Biocon founder Kiran Mazumdar Shaw and HT Media Chair Shobhana Bhartia are among the world's 100 most powerful women.
Story first published: Wednesday, May 27, 2015, 17:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X