For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'వడ్డీరేట్లు తగ్గించండి, రూపాయిని పోటీలో నిలబెట్టండి'

By Nageswara Rao
|

వచ్చే వారంలో జరగనున్న ద్రవ్యపరపతి సమీక్ష విధానంలో వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ సూచించారు. చైనా లాంటి దేశాలు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతున్నాయని, రూపాయిని పోటీలో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టాలన్నారు.

ఈ ఏడాది
వర్షపాతం ఆశాజనకంగా లేకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గినా, ప్రతికూల పరిస్థితులు తట్టుకునేందుకు ప్రభుత్వం వద్ద సరిపడా ఆహార ధాన్యాల నిల్వలున్నాయని అన్నారు. ఈ ఏడాది సిపిఐ ద్రవ్యోల్బణం 5- 5.5 శాతం మధ్య ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పీపా ఒక్కింటికి 50- 80 డాలర్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి 7- 7.9 శాతం మధ్య ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్రమణియన్ పలు విషయాలను ప్రస్తావించారు.

Arvind Subramanian

జీఎస్‌టీ రేటుకు మించి రాష్ట్రాలు 1 శాతం పన్నుని అదనంగా వసూలు చేసుకునే అంశాన్ని కూడా కేంద్రం పునఃసమీక్షిస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రాల మధ్య సరుకు రవాణా మరింత భారంగా మారడంతో పాటు, మేకిన్ ఇండియాకు విఘాతంగా మారుతుందని అన్నారు.

ఉదాహారణకు 'గుజరాత్ నుంచి తమిళనాడుకు ఒక వస్తువును రవాణా చేయాలంటే నాలుగు రాష్ట్రాలను దాటాలి. ప్రతి రాష్ట్రం 1 శాతం పన్ను వసూలు చేస్తుందనుకుంటే, ఆ వస్తువుపై 4 నుంచి 5 శాతం పన్ను భారం పడుతుంది. దీనితో పోలిస్తే, బ్యాంకాంక్ నుంచి తమిళనాడు ఆ వస్తువుని దిగుమతి చేసుకోవడమే సులభం' అని అన్నారు.

దీంతో తయారీ రాష్ట్రాలు డిమాండ్ చేయడంతో రెండేళ్ల పాటు 1 శాతం అదనపు పన్ను వసూలు చేసుకోవచ్చని జీఎస్‌టీ సవరణ బిల్లులో చేర్చామని పేర్కొన్నారు.

English summary

'వడ్డీరేట్లు తగ్గించండి, రూపాయిని పోటీలో నిలబెట్టండి' | Arvind Subramanian asks for interest rate cuts ahead of RBI monetary policy review; calls for a competitive rupee

Chief Economic Advisor (CEA) Arvind Subramanian made a strong case for interest rate cuts a week before Reserve Bank of India Governor Raghuram Rajan reviews monetary policy. Subramanian also said that India should not allow the rupee to become uncompetitive when nations such as China are resorting to aggressive monetary easing to make their currencies weaker.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X