For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్ 1 నుంచి సర్వీస్ ట్యాక్స్: మొబైల్, విమాన ప్రయాణం, రెస్టారెంట్ మరింత ప్రియం

By Nageswara Rao
|

దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి అన్ని రకాల సేవలూ మరింత ప్రియం కానున్నాయి. ఇందుకు కారణం ఇప్పటి వరకు 12.36 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పార్లమెంట్‌ ఇందుకు ఆమోదం తెలపడంతో జూన్‌ 1 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెస్టారెంట్‌లలో తినడం:

జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక మాదిరి హోటల్‌కి వెళ్లి టిఫిన్‌ చేసినా ఆ బిల్లుపై అదనంగా 14 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తారు. గతంలో ఈ సర్వీస్ ట్యాక్స్ 12.36 శాతంగా ఉండేది. పెరిగిన సర్వీస్ ట్యాక్స్ మూలంగా జూన్ 1 నుంచి హోటల్‌లో తినడం లాంటివి పెనుభారంగా మారనున్నాయి.

మొబైల్ బిల్లులు:

సర్వీస్ ట్యాక్స్ పెరగడం వల్ల మొబైల్ బిల్లులు మరింత భారం కానున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌ రీఛార్జ్‌ కూపన్‌ ధర సైతం పెరగనుంది.

Here Are Things That Will Get More Expensive From June 1, 2015

విమాన ప్రయాణం:

సర్వీస్ ట్యాక్స్ పెరగడం వల్ల విమాన ప్రయాణం మరింత భారం కానుంది. జూన్ 1 నుంచి విమాన ప్రయాణాలపై 14 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తారు. వీటితో పాటు మరికొన్ని సేవలపై కూడా సర్వీస్ ట్యాక్స్ భారం పడునుంది. అవేంటో చూద్దాం.

1. డీటీహెచ్ సర్వీసులు

2. బ్యూటీ పార్లర్

3. ఇన్సూరెన్స్

4. స్టాక్ బ్రోకరేజ్ సర్వీసులు

5. కొరియర్ సర్వీసు

6. లాండ్రీ సర్వీసు

7. ఆర్కిటెక్ట్‌ల సేవలు

8. ప్రకటనల బిల్లులు

9. క్రెడిట్‌ కార్డు బిల్లులు

ఈ ఏడాది పార్లమెంట్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ 12.36 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కేవలం అతి తక్కువ సేవలకే ఈ సేవాపన్ను మినహాయింపునిచ్చారు.

English summary

జూన్ 1 నుంచి సర్వీస్ ట్యాక్స్: మొబైల్, విమాన ప్రయాణం, రెస్టారెంట్ మరింత ప్రియం | Here Are Things That Will Get More Expensive From June 1, 2015

The service tax hike as recommended in the Union Budget 2015-16 would take effect from June 1, 2015. Here are a few things that would get more expensive from June 1, 2015.
Story first published: Wednesday, May 20, 2015, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X