For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: మన జీవనవిధానంలో పోస్టల్ వ్వవస్ధతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే, పెరిగిపోయిన టెక్నాలజీ వల్ల ఆ అనుబంధం కాస్తంత తగ్గింది. తగ్గిన పోస్టల్ వ్వవస్ధ సమాన్యులకు చేరువ అయ్యేందుకు ఎప్పటికప్పుుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇందులో భాగంగా సామాన్య ప్రజల కోసం పోదుపు పథకాలను ప్రవేశపెట్టిన పోస్టల్ వ్యవస్ధ, తాజాగా ఆ పొదుపు నగదుని తీసుకునేందుకు గాను ఏటీఎంలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని హెడ్ పోస్టాఫీసుల్లో ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ, ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ బీవీ సుధాకర్ తెలిపారు.

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

మంగళవారం ఆయన అబిడ్స్ లోని హెడ్ పోస్టాపీసులో తొలి ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసులను అధునాతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు తీసుకవెళుతున్నామని చెప్పారు.

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ఎలాంటి లాభాలను ఆశించకుండా వినియోగదారులకు సేవలు చేయడానికి పోస్టాఫీసుల్లో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టామన్నారు. పోస్టాఫీసుల పనైపోయిందనే లాంటి వాటిని పొగట్టడానికి గాను సాంకేతక పరిజ్ఞానం వైపు మళ్లిస్తున్నామని వివరించారు.

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మంచి సేవలందించేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,438 సబ్ పోస్టాఫీసుల స్థాయిని ఆధునీకరించామన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 95 హెడ్ పోస్టాఫీసుల్లో ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు తెలపగా, వాటిలో36 ఏటీఎం కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

గ్రామీణ ప్రాంతాలలో పోస్టాఫీసు వినియోగదారులకు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నామని, ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుని సేవలను విస్తృతం చేస్తామని తెలిపారు.

 ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం

తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధాన దర్శనం టికెట్ల బుకింగ్ సదుపాయాన్ని మరింత సరళతరం చేశామని, పోస్టాఫీసుల్లో బుక్ చేసుకున్నవారికి టీటీడీ ఇచ్చే రెండు లడ్డూలకు అదనంగా మరో లడ్డూను కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.

English summary

ప్రారంభమైన తొలి పోస్టల్ ఏటీఎం (ఫోటోలు) | India Post to set up 95 ATMs in Telangana, Andhra Pradesh soon

Thirty-six will be in Telangana and the remaining in Andhra Pradesh. Chief Postmaster General, AP Circle, B V Sudhakar inaugurated first India Post ATM in Telangana today at Hyderabad GPO.
Story first published: Wednesday, May 6, 2015, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X