For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులకు వరుస సెలువులు, ఆర్‌బీఐ జోక్యంపై అసోచామ్

By Nageswara Rao
|

బెంగుళూరు: వచ్చే వారం, పది రోజుల్లో మీకు బ్యాంకులతో పని ఉందా.. అయితే వాటిని ఈరోజే చక్కబెట్టుకుంటే మంచిది. ఎందుకుంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ప్రేడే పండుగులతో పాటు వార్షిక ఖాతా ముగింపు వంటివి ఇందుకు కారణాలు. దీంతో స్టాక్ మార్కెట్, వాణిజ్య లావాదేవీలు, వేతనాల చెల్లింపు, ఎగుమతి-దిగుమతులకు సంబంధించిన ఆర్ధిక కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అసోచామ్ పేర్కొంది.

అంతే కాదు ఈ విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని, బ్యాంకులు కొన్ని ఏర్పాట్లు చేసుకునేలా ఆర్ధిక శాఖ సూచించాలని అసోచామ్ కోరింది. దీంతో ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల బ్రాంచీలన్నీ ఈ నెల 30, 31 తేదీల్లో పూర్తిస్దాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

String of bank holidays from March 28 to affect consumers: Assocham

ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 30న బ్యాంకులు పూర్తిరోజు పనిచేస్తాయి. 31వ తేదీన రాత్రి 8 గంటల వరకూ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీల నిర్వహణకు కౌంటర్లు తెలిచి ఉంటాయి.

ఆర్దిక సంవత్సరం పూర్తి అయిన రోజే, ఆ ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలన్నీ పూర్తికావడానికి వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కోంది. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎలక్ట్రానిక్ లావాదేవీలు కొనసాగుతాయని తెలిపింది.

సెలవుల వివరాలు:

మార్చి 28 - శ్రీరామనవమి
మార్చి 29 - ఆదివారం
మార్చి 30 - పనిదినం
మార్చి 31, ఏప్రిల్ 1 - వార్షిక ఖాతాల ముగింపు
ఏప్రిల్ 2 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 3 - గుడ్ ప్రైడే
ఏప్రిల్ 4 (శనివారం) - సగం రోజు మాత్రమే
ఏప్రిల్ 5- ఆదివారం

English summary

బ్యాంకులకు వరుస సెలువులు, ఆర్‌బీఐ జోక్యంపై అసోచామ్ | String of bank holidays from March 28 to affect consumers: Assocham

A string of holidays lined up one after the other, coupled with banks’ annual closing of accounts for the financial year, could disrupt financial transactions in the stock markets, export and shipments, and salary payments, warned the Associated Chambers of Commerce & Industry of India (Assocham).
Story first published: Friday, March 27, 2015, 9:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X