For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఆర్‌సీటీసీ రూపే కార్డు: ఏ విధంగా ఉపయోగపడుతుంది..?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు ఇక నుంచి తమ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, షాపింగ్, వివిద సేవల బిల్లుల చెల్లింపులకు రూపే ప్రీపెయిడ్ డెబిట్ కార్డులను ఉపయోగించవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో ఐఆర్‌సీటీసీ ఈ కార్డులను మంగళవారం ఆవిష్కరించింది.

Railways Launch RuPay Pre-Paid Debit Card

రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రకటించిన ఆర్ధిక అభివృద్ధిలో ఇది ఒక భాగమని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలేని వారు సైతం ఈ కార్డులు తీసుకోవచ్చని వివరించారు. భారత కంటైనర్ కార్పోరేషన్ రూ. 10 కోట్లతో నిర్మించిన కార్గో సెంటర్‍‌‌ను ఆయన ప్రారంబించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో లేదా ఐఆర్‌సీటీసీ ఇంటర్నెట్ ద్వారా వీటిని తీసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, ఎండీ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీటిని ప్రారంభించామని, కొనుగోళ్లు, వివిధ సేవల బిల్లుల చెల్లింపు సదుపాయాలను మరికొన్ని రోజుల్లో వీటికి జత చేస్తామని అన్నారు.

English summary

ఐఆర్‌సీటీసీ రూపే కార్డు: ఏ విధంగా ఉపయోగపడుతుంది..? | Railways Launch RuPay Pre-Paid Debit Card

Railway passengers can now book their tickets, do shopping and pay service bills using RuPay pre-paid cards, as the IRCTC launched the debit card service here today.
Story first published: Wednesday, March 25, 2015, 8:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X