For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచవల్ ఫండ్స్ కోసం 'సింగిల్ విండో' విధానం

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక ఫామ్ నింపటంతో పాటు, ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివాల్సి ఉంటుంది. అదే సంస్ధ ఆఫర్ చేస్తున్న మరో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇంకో ఫామ్ నింపి, మరో చెక్ ఇవ్వాలి.

ఇలాంటి ఒకే సంస్ధలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ సింగిల్ విండో ద్వారా లావాదేవీల ప్లాట్‌ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ' '(ఎంఎఫ్‌యూ) పేరిట నిర్వహించవచ్చు.

దీంతో సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా, ప్రత్యేకించి ఫామ్‌లు, చెక్కులు నింపాల్సిన అవసరం లేదు. ఎంఎఫ్‌యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు వెళతాయి.

Investors too can invest online directly through MF Utility

‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ'ని మీరు ఉపయోగించాలంటే మీకు ‘కామన్ అకౌంట్ నంబర్' (క్యాన్) ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపి ఇవ్వటం ద్వారా ఏఎంఎఫ్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు. దీని ద్వారా ఆ వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

దీంతో పాటు మీ పెట్టుబడులను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్‌లు, ట్రిగ్గర్‌లు, రిమైండర్ల లాంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్‌యూను వినియోగించుకోవటానికి అంగీకరించాయి.

English summary

మ్యూచవల్ ఫండ్స్ కోసం 'సింగిల్ విండో' విధానం | Investors too can invest online directly through MF Utility

Direct plans, which have been a cause of concern for distributors, will be available for investors on the upcoming MF Utility platform.
Story first published: Monday, March 16, 2015, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X