For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతి సుజుకీ క్యూ3 ఫలితాలు: లాభం రూ.802 కోట్లు

By Nageshwara Rao
|

న్యూఢిల్లీ: మారుతీ సుజకీ మూడో త్రైమాసిక ఫలితాలు మదుపర్లలో ఉత్సహం కలిగించాయి. నికరలాభం మెరుగ్గా ఉన్నా, విశ్లేషకుల అంచనాలకు కాస్త దూరంలో నలించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో రూ. 802.2 కోట్లు నికరలాభాన్ని ఆర్జించింది.

2013-14 ఇద సమయంలో ఆర్జించిన నికరలాభం రూ. 681.15 కోట్లతో పోలిస్తే ఈసారి 17.8 శాతం అధికం. ఇక నికర విక్రయాలు రూ. 10,619.68 కోట్ల నుంచి 15.5 శాతం పెరిగి రూ. 12,263.14 కోట్లకు చేరాయి. ఈ త్రైమాసికంలో విక్రయించిన వాహనాల సంఖ్య 2,88,151 నుంచి 12.4 శాతం పెరిగి 3,23,911కు చేరాయి.

 Maruti Suzuki Q3 Net Profit Rises 18% at Rs 802 Crore

ఇందులో దేశీయ అమ్మకాలు 2,68,185 నుంచి 2,95,202కు ఎగుమతులు 19,966, నుంచి 28, 709కు పెరిగాయి. ఇక సమీక్ష త్రైమాసికంలో ఎగుమతులపై రూ. 1,224 కోట్ల ఆదాయం లబించింది.

వాహనాలు అధికంగా విక్రయించడం, ముడి పదార్ధాలు ఖర్చు తగ్గించుకునేందుకు తీసుకున్న చర్యలతో పాటు విదేశీ మారక ద్రవ్య విలువ కలిసి రావడం వల్ల నికర లాభం పెరిగిందని సంస్ధ పేర్కొంది. మారుతీ సుజుకీ ఇండియా నికరలాభం రూ. 875 కోట్లకు చేరుతుందని విశ్లేషకలు అంచనా వేశారు. ఐతే ఇది రూ. 73 కోట్ల మేర తగ్గింది.

English summary

మారుతి సుజుకీ క్యూ3 ఫలితాలు: లాభం రూ.802 కోట్లు | Maruti Suzuki Q3 Net Profit Rises 18% at Rs 802 Crore

The country's largest carmaker Maruti Suzuki India on Tuesday reported 17.8 per cent increase in net profit at Rs 802.2 crore for the third quarter ended December 31, 2014.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X