For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నకిలీ బ్యాంకుతో రూ. 196 కోట్లు లూటీ: బీబీసీ

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: చైనాలో నకిలీ బ్యాంకు పేరుతో ప్రజల మోసపోయారు. నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఏర్పాటు చేసి సుమారు 200మంది వద్ద బ్యాంకులో నగదు జమ చేయించి ఆ తర్వాత పత్తా లేకుండా ఉడాయించారని బీబీసీ తన నివేదికలో పేర్కొంది.

వివరాల్లోకి వెళితే... నాన్జింగ్ నగరం తూర్పున నకిలీ బ్యాంకును ఐదుగురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అన్ని బ్యాంకుల మాదిరే ఈ నకిలీ బ్యాంకు కూడా కార్యకలాపాలను నిర్వహించింది. అధిక వడ్డీ ఆశ చూపడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ బ్యాంకులో నగదును డిపాజిట్ చేయడం మొదలు పెట్టారు.

Fake Chinese Bank Loots $32 Million: BBC

అలా ఆ నకిలీ బ్యాంకులో సుమారు 32 మిలియన్ డాలర్లు (సుమారు 196 కోట్లు) నగదు జమ అయింది. కస్టమర్లకు ఇస్తామన్న వడ్డీ ఇవ్వకపోడవంతో.. వారు నగదుని తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో ఇదే అదనుగా భావించి ఐదుగురు సభ్యులు మొత్తం డబ్బుతో ఉడాయించారు. ఈ నకిలీ బ్యాంకు మోసంలో ఒక్కొక్కరు 1.9 మిలియన్ డాలర్లును తమ వంతు వాటాగా పంచుకున్నారు.

పోలీసుల విచారణలో అసలు బ్యాంకును ఏర్పాటు చేసేందుకు లైసెన్సు పొందకుండానే వారు కార్యకలాపాలు కొనసాగించారని వెల్లడైంది. ఈ నకిలీ బ్యాంకు తన కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. ఈ నకిలీ బ్యాంకు స్కామ్‌లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు బీబీసీ పేర్కొంది.

Read more about: money china మనీ చైనా
English summary

నకిలీ బ్యాంకుతో రూ. 196 కోట్లు లూటీ: బీబీసీ | Fake Chinese Bank Loots $32 Million: BBC

Conmen deceived around 200 people into handing over their money by setting up a fake bank near the eastern city of Nanjing, according to BBC report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X