For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో కన్జ్యూమర్ కేర్ సెంటర్

|

న్యూఢిల్లీ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నగరాల్లో కన్జ్యూమర్ కేర్ సెంటర్లు(గ్రహక్ సువిధా కేంద్రాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతంగా పరిష్కరించడానికి ఈ సెంటర్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి.

ఈ కన్జ్యూమర్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి డిపార్టుమెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Central Govt to launch consumer helplines in selected states

న్యూఢిల్లీతోపాటు లక్నో, ఛండీగఢ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, పుణె, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, షిల్లాంగ్, రాయ్‌పూర్, భూపాల్ వంటి నగరాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నది.

వినియోగదారుల ఫోరంలో నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఒక టోల్-ఫ్రీ నంబర్‌ను జారీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

English summary

హైదరాబాద్‌లో కన్జ్యూమర్ కేర్ సెంటర్ | Central Govt to launch consumer helplines in selected states

Department of Consumer Affairs, Ministry of Consumer Affairs, Food and Public Distribution will launch helpline for consumers in all states to function as a one stop centre providing a spectrum of services to consumers.
Story first published: Saturday, December 27, 2014, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X