For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిమెంట్ రంగంలో పెద్ద డీల్: అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ జరిగింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సంస్థ.. జైప్రకాశ్ అసోసియేట్స్‌కు (జేఏఎల్) మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,400 కోట్లు.

జేపీ అసోసియేట్స్‌కు బేలాలో ఉన్న ప్లాంట్ ఏటా 21 లక్షల టన్నుల క్లింకర్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు 26 లక్షల టన్నుల సిమెంట్ గ్రైండ్ చేయగలదు. సిధిలో ఉన్న మరో ప్లాంటు వార్షిక క్లింకర్ సామర్థ్యం 31 లక్షల టన్నులు.

UltraTech Cement signs MoU with Jaypee for Madhya Pradesh cement plants

కాగా.. 23 లక్షల టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్ద్యం కలిగిన యూనిట్లతో పాటు 180 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను జేఏఎల్ నుంచి కొనుగోలు చేసేందుకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని దేశంలోనే అతి పెద్ద సిమెంట్ తయారీ సంస్ధ అల్ట్రాటెక్ మంగళవారం వెల్లడించింది.

ఈ డీల్‌తో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం మరో 49 లక్షల టన్నుల మేర పెరుగనుందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ప్రస్తుతం అల్ట్రాటెక్ వార్షిక సిమెంట్ తయారీ సామర్ధ్యం 6 కోట్ల టన్నులు కాగా, ఈ కోనుగోలు అనంతరం 6.5 కోట్లకు చేరనుంది.

అప్పులతో ఇబ్బంది పడుతున్న జైప్రకాశ్ అసోసియేట్స్‌కు ఇంకా 2.2 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్ధ్యం ఉంది. రుణ మొత్తాన్ని తగ్గించుకునేందుకు సిమెంట్, విద్యుత్త యూనిట్లను విక్రయిస్తున్నట్లు సంస్ధ తెలిపింది.

English summary

సిమెంట్ రంగంలో పెద్ద డీల్: అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు | UltraTech Cement signs MoU with Jaypee for Madhya Pradesh cement plants

UltraTech Cement has signed a memorandum of understanding (MoU) to buy two cement plants of Jaiprakash Associates in Madhya Pradesh, a deal that will help consolidate its position as India's biggest cement-maker.
Story first published: Wednesday, December 24, 2014, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X