For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కలల ప్రాజెక్టు స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ అవకాశం ఎల్ అండ్ టీ చేతికి దక్కింది. దేశం మొత్తాన్ని ఏకం చేసి ఒక తాటిపై నడిపించిన తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహాన్ని 182 మీటర్ల పొడువుతో నిర్మించాలన్నది ముఖ్య ఉద్దేశ్యం.

గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు ద్వీపంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ఈ పనులకు ప్రస్తుత ప్రధాని మోడీ, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గత ఏడాది అక్టోబర్ 31న శంకుస్దాపన చేశారు.

రూ. 2,979 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులను ఎల్ అండ్ టీకి అప్పగించారు. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వర్క్ ఆర్డర్‌ను ఎల్ అంట్ టీకి అందజేశారు. రూ. 1,347 కోట్లతో పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తారు.

రూ. 235 కోట్లతో ప్రదర్శనా మందిరం నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలపై ఆడియో, వీడియో ప్రదర్శనలు ఇస్తారు. రూ. 83 కోట్లతో వంతెన నిర్మిస్తారు. 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 టన్నుల ఉక్కు, 18,500 టన్నుల ఉక్కు కడ్డీలు, 22,500 టన్నుల కాంస్యం ఈ ప్రాజెక్టులో వినియోగించనున్నారు.

నిర్మాణం పూర్తయ్యాక 15 సంవత్సరాల పాటు నిర్వహణకు రూ. 657 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న స్టాట్యా ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం ప్రపంంచలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ (128 మీటర్లు) విగ్రహం ఖ్యాతి పొందింది.

 ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ అవకాశం ఎల్ అండ్ టీ చేతికి దక్కింది. రూ. 2,979 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులను ఎల్ అండ్ టీకి అప్పగించారు.

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వర్క్ ఆర్డర్‌ను ఎల్ అంట్ టీకి అందజేశారు. రూ. 1,347 కోట్లతో పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తారు.

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

రూ. 235 కోట్లతో ప్రదర్శనా మందిరం నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలపై ఆడియో, వీడియో ప్రదర్శనలు ఇస్తారు. రూ. 83 కోట్లతో వంతెన నిర్మిస్తారు. 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 టన్నుల ఉక్కు, 18,500 టన్నుల ఉక్కు కడ్డీలు, 22,500 టన్నుల కాంస్యం ఈ ప్రాజెక్టులో వినియోగించనున్నారు.

 ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ

నిర్మాణం పూర్తయ్యాక 15 సంవత్సరాల పాటు నిర్వహణకు రూ. 657 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న స్టాట్యా ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం ప్రపంంచలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా రికార్డు సృష్టించనుంది.

Read more about: money మనీ
English summary

ఎల్ అండ్ టీ చేతికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఫోటోలు) | Gujarat govt issues Rs 2,979-cr work order to L&T for Statue of Unity

The Gujarat government issued work order of Rs 2,979 crore to one of India’s largest engineering firm, Larsen & Toubro (L&T), on Monday to construct the Statue of Unity, the world’s tallest statue and one of Prime Minister Narendra Modi’s pet projects.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X