For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరంగల్ కేంద్రంగా 'లైనస్ క్యాపిటల్' పెట్టబడులు

By Nageswara Rao
|

హైదరాబాద్: అమెరికాకు చెందిన పెట్టబుడుల సంస్ద 'లైనస్ క్యాపిటల్' సంస్ద కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాని ప్రధాన కార్యలయంగా చేసుకుని తన కార్యకలాపాలు ప్రారంభనుంది. 'లైనస్ క్యాపిటల్' సంస్ద భారతదేశం, ఇండోనేషియాలో పెట్టుబడులను సంయుక్తంగా మదుపు చేస్తుంది.

వరంగల్ వాసి అయిన సున్నీ బుర్రా, లైనస్ క్యాపిటల్ సంస్దకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నారు. సునీల్ బుర్రా వరంగల్‌లోని నేషనల్ ఇనిట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. అనంతరం ఎమ్‌బీఏను చికాగో యూనివర్సిటీలో పూర్తి చేశారు.

 Linus to open shop in Telangana

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అయిన డాక్టర్. తాడికొండ రాజయ్యను కలిసి సున్నీ బుర్రా తెలంగాణ రాష్ట్రంలో తాను పెట్టనున్న పెట్టుబడుల గురించి వివరించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో వరంగల్ పట్టణంలోని యువతతో పాటు మారుమూల పల్లెల్లో ఉన్న సుమారు 500 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్బంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలంటే సునీల్ బుర్రా లాంటి వారు కావాలని ఆయన్ని ప్రశంసించారు. బంగారు తెలంగాణలో భాగస్వామి అయ్యేందుకు ఎక్కవ మంది పారిశ్రామికవేత్తలు తరలి రావాలని అన్నారు.

Read more about: telangana తెలంగాణ
English summary

వరంగల్ కేంద్రంగా 'లైనస్ క్యాపిటల్' పెట్టబడులు | Linus to open shop in Telangana

Linus Capital, a US-based investment group having investments in India and Indonesia, is about to explore investment opportunities in the newly-formed Telangana state with its headquarters in Warangal.
Story first published: Thursday, October 16, 2014, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X