For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు ఉపయోగించడం ఎలా..?(పిక్చర్స్)

మన వృత్తి, ఆదాయ వనరులు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులు క్రెడిట్‌కార్డులను ఇస్తాయి. ప్రతి క్రెడిట్‌కార్డుకు కొంత పరిమితి ఉంటుంది. ఆ పరిమితి వరకూ మనం ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డు అంటే మన ద

By Nageshwara Rao
|

న్యూఢిల్ల్లీ: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. ఐతే చాలా మంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లిచాల్సి వస్తుందని వాపోతున్నారు. అసలు తొలుత క్రెడిట్ కార్డు ఎలా ఇస్తారనేది తెలుసుకుందాం.

మన వృత్తి, ఆదాయ వనరులు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులు క్రెడిట్‌కార్డులను ఇస్తాయి. ప్రతి క్రెడిట్‌కార్డుకు కొంత పరిమితి ఉంటుంది. ఆ పరిమితి వరకూ మనం ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డు అంటే మన దగ్గర డబ్బులు లేని సమయంలో మన అవసరాలకు వాడుకొవడం అని మనం అర్దం చేసుకోవాలి.

క్రెడిట్ కార్డు తీసుకునే మందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. ఎంత పరిమితి మొత్తాన్ని ఆ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు, ఆ కార్డుకు చెల్లించాల్సిన ఫీజు ఏమిటి, మనం వాడుకున్న మొత్తంపై ఎంత శాతం వడ్డీ విధిస్తారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి.

 ఎలాంటి కార్డు తీసుకుంటే మంచిది

ఎలాంటి కార్డు తీసుకుంటే మంచిది

క్రెడిట్‌ కార్డులలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణ క్రెడిట్‌ కార్డులు, కొన్ని రివార్డులను ప్రకటించే కార్డులు మొదలైనవి. క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు మనకు ఎలాంటి కార్డు కావాలో స్పష్టమైన అవగాహనతో దరఖాస్తు చేయాలి.

 కార్డుని వాడటం ఎలా

కార్డుని వాడటం ఎలా

క్రెడిట్‌ కార్డు వచ్చిన తర్వాత రోజువారీ చేసే షాపింగ్‌కు ఉపయోగించకూడదు. ముఖ్యంగా హొటళ్లు, బట్టలు కొనడం వంటి ప్రతి దానికీ క్రెడిట్‌ కార్డునలు ఉపయోగిస్తే ఇబ్బంది ఎదురవుతుంది. నగదుతో కొనాల్సిన ప్రతి వస్తువునూ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొనడం వల్ల.. అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది.

 నిర్ణీత గడువులో చెల్లించండి

నిర్ణీత గడువులో చెల్లించండి

క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన తర్వాత ఎంత మొత్తం కొనుగోలు చేశామో, అందులోనుంచి కనీసం కొంత మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల చెలించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు. ఐతే, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ వస్తే, మిగిలిన మొత్తం ఎక్కువవుతుంది. దానిపై చెల్లించాల్సిన వడ్డీ కూడా బాగా పెరుగుతుంది.

ఎక్కువ ఖర్చు చేయకూడదు

ఎక్కువ ఖర్చు చేయకూడదు

క్రెడిట్‌ కార్డును ఉపయోగించి మన శక్తికి మించిన ఖర్చు చేయకూడదు. బాగా ఖరీదైన, మన తాహతుకు మించిన వస్తువులను కొనుగోలు చేశామంటే అప్పు చేసినట్లే. ఈ అప్పు తీర్చమడంలో విఫలం అయ్యామంటే రుణ భారం భారగా పెరుగుతుంది.

 అవసరమైనవే కొనాలి

అవసరమైనవే కొనాలి

ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే అవసరమనే వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. మనకు నిజంగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నామంటే, మన కార్డును బాధ్యతాయుతంగా వాడుతున్నట్లు.

 లేట్‌ ఫీజ్‌ గురించి తెలుసుకోండి

లేట్‌ ఫీజ్‌ గురించి తెలుసుకోండి

క్రెడిట్‌ కార్డును ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ప్రతి నెలా కొంత మొత్తాన్ని తీర్చాలి. లేట్‌ ఫీజ్‌ ఎంత పడుతుందనే విషయాన్ని బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి.

 రుణ పరిమితి

రుణ పరిమితి

క్రెడిట్‌ కార్డును జారీ చేసినప్పుడు సంబంధిత కార్డుపై మనం ఎంత మేరకు రుణం పొందగలమో తెలుసుకోవాలి. అందులో కేవలం 30 శాతం మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. రుణ పరిమితి ఉందని ఎక్కువ మొత్తాల్లో వాడుకుంటే తిరిగి చెల్లించే సమయంలో ఇబ్బందులు పడతారు.

 స్టేట్ మెంట్‌ను చెక్ చేసుకోండి

స్టేట్ మెంట్‌ను చెక్ చేసుకోండి

ప్రతినెలా క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్టేట్‌మెంట్‌లోని బిల్లు సరైనదే లేదా అని సరిచూసుకోవాలి. స్టేట్‌మెంట్‌లో లావాదేవీలను పరిశీలించాలి.

 అవకతవకలు

అవకతవకలు

క్రెడిట్ కార్డు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే.. సదరు బ్యాంకు వద్దకు వెళ్లి అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకుని వెళ్లాలి.

 అవకతవకలు

అవకతవకలు

క్రెడిట్ కార్డు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే.. సదరు బ్యాంకు వద్దకు వెళ్లి అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకుని వెళ్లాలి.

English summary

క్రెడిట్ కార్డు ఉపయోగించడం ఎలా..?(పిక్చర్స్) | How to Use a Credit Card

Getting a credit card can be an exciting thing, but it comes with a lot of responsibility. Regardless, credit cards are incredibility simple to use.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X