For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 3లో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ సంస్ద ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాజితాలో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి ముడో స్దానంలో నిలిచారు. వివరాల్లోకి వెళితే మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ - 2014 పేరుతో జాబితాను ప్రకటించింది.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఇంద్రనూయి కావడం విశేషం. మొదటి స్దానంలో ఐబీఎమ్ ఛైర్మన్, సీఈఓ రోమెటీ దక్కించుకోగా... రెండో స్దానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా ఉన్నారు. గత ఏడాది ప్రకటించిన ఇదే జాబితాలో ఇంద్రనూయి రెండో స్దానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Fortune ranks PepsiCo's Indra Nooyi third most powerful woman in business

ఇంద్రనూయి తమిళనాడుకు చెందిన వారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫార్చ్యూన్ సంస్ద విడుదల చేసిన జాబితాలో ఇంద్రనూయి టాప్ - 10 స్దానంలో చోటు దక్కించుకుంటున్నారు. 2006, 2007, 2008, 2009, 2010 ఇలా వరుసగా ఐదు సంవత్సరాల పాటు మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ జాబితాలో అగ్రస్దానంలో నిలవడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది రెండవ స్దానంలో నిలిచిన జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా గత ఏడాది 29వ స్దానంలో నిలిచారు.

English summary

టాప్ 3లో పెప్సికో సీఈఓ ఇంద్రనూయి | Fortune ranks PepsiCo's Indra Nooyi third most powerful woman in business


 PepsiCo's India-born CEO Indra Nooyi has been ranked third most powerful businesswoman by Fortune, the only Indian-origin woman on the 2014 list topped by IBM Chairman and CEO Ginni Rometty and General Motors CEO Mary Barra.
Story first published: Friday, September 19, 2014, 14:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X