For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కో పైలెట్ పిటిషన్, విజయ్ మాల్యాకు కోర్టు సమన్లు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యాతో పాటు ఆ కంపెనీ వైస్ ఛైర్మన్ రూపీ ఆర్యకు ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహర్ న్యాయస్దానం సమన్లు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్ద తనకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదంటూ ఆకాష్ శర్మ అనే కో పైలెట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Kingfisher Airlines Chairman Vijay Mallya summoned by court

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6వ తారీఖున విజయ మాల్యాను కోర్టులో హాజరుపరచాలని బెంగుళూరు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది.

తాను 2006లో డెక్కన్ ఏవియేషన్ సంస్దలో కో పైలట్‌గా చేరానని, ఆ తర్వాతి కాలంలో ఆ సంస్దను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ టేకోవర్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. 2012లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తన కార్యకలాపాలు నిలిచిపోగా, తనకు రూ. 28.50 లక్షలు రావాల్సి ఉందని ఆకాష్ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

English summary

కో పైలెట్ పిటిషన్, విజయ్ మాల్యాకు కోర్టు సమన్లు | Kingfisher Airlines Chairman Vijay Mallya summoned by court

The court's order came in the wake of a complaint filed in court by a co-pilot of the airline contending that the accused were not paying his dues amounting to over Rs 28 lakh notwithstanding a written assurance by Arya.
Story first published: Thursday, September 18, 2014, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X