For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నెంబర్ వన్ ముఖేష్ అంబానీయే

By Nageswara Rao
|

 Ambani tops Hurun India Rich List again, Adani makes it to big league
హైదరాబాద్: భారత్‌లోని సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి మొదటి స్దానంలో నిలిచారు. హురూన్ ఇండియా సంపన్నుల జాబితా 2014 ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తులు ఈ ఏడాది 37 శాతం పెరిగి రూ. 1.65 లక్షల కోట్లకు చేరడంతో ఆయన నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నారు.

సన్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్దాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వీ రెండో స్దానంలో, ఆర్సెలార్ మిట్టల్, సీఈఓ ఎల్ ఎన్ మిట్లల్ మూడో స్దానంలో ఉన్నారు. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ నాల్గవ స్దానంలో, హెచ్ సీఎల్ ఛైర్మన్ శివ నాడార్ ఐదో స్దానంలో ఉన్నారు.

ఆరవ స్దానంలో హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ ఛైర్మన్ పి. మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ఎనిమిదో స్దానంలో ఉండగా... భారతి ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ గ్రూప్ సీఈఓ సునీల్ మిట్టల్ తొమ్మిదో స్దానంలో ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా మెలిగే అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 10వ స్దానంలో ఉన్నారు.

English summary

మళ్లీ నెంబర్ వన్ ముఖేష్ అంబానీయే | Ambani tops Hurun India Rich List again, Adani makes it to big league


 Mukesh Ambani held on to his position as the richest man in India with a fortune of ₹1.65 lakh crore, up 37 per cent from last year.
Story first published: Wednesday, September 17, 2014, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X