For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం: కెటిఆర్(పిక్చర్స్)

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య తలెత్తిందని అన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పది కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రాంతాలలో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

ఐదు సంవత్సరాల కాలంలో హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో జెఎండి సంగీతారెడ్డి పాల్గొన్నారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు.

కెటిఆర్

కెటిఆర్

శుక్రవారం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కెటిఆర్

కెటిఆర్

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య తలెత్తిందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పది కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కెటి రామారావు తెలిపారు.

English summary

సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం: కెటిఆర్(పిక్చర్స్) | We will establish a Solar project soon in Mahaboobnagar: KTR

Telangana minister KT Rama Rao on Friday said that the government will establish a Solar project soon in Mahaboobnagar.
Story first published: Saturday, September 13, 2014, 10:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X