For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్‌లోకి కొత్త మహీంద్రా అర్జున్‌ నోవో(పిక్చర్స్)

|

హైదరాబాద్‌: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా కంపెనీ హైదరాబాద్‌లో మంగళవారం తన కొత్త అర్జున్‌ నోవో ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. సంస్థ ట్రాక్టర్‌ అండ్‌ ఫామ్‌ మెకనైజేషన్‌ బిజినెస్‌ మార్కెటింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రవీంద్ర సహానె, సేల్స్ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ శర్మ తదితరులు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర సహానె మాట్లాడుతూ.. సాంకేతికంగా అత్యాధునిక రీతిలో, ఆకర్షణీయ శైలిలో అర్జున్‌ నోవో రూపుదిద్దుకుందని అన్నారు.

పూర్తి సరికొత్త అత్యున్నత హార్స్ పవర్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మొదటి మోడల్‌గా దీన్ని అభివర్ణించారు. ఇందులో 57 హెచ్‌పీ, 52 హెచ్‌పీ రెండు రకాలు లభిస్తాయన్నారు. పనితీరు విషయానికి వస్తే ఇవి 2,200 కేజీల బరువును లిఫ్ట్ చేయగలదని, తమ శ్రేణిలో అత్యుత్తమ ఇంధన సామర్థ్యం, అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో ఆధునిక సింక్రోమెష్‌ ట్రాన్‌‌సమిషన్‌, 18 స్పీడ్‌ ఆప్షన్లు (15 ఫార్వర్డ్, మూడు రివర్స్), త్వరగా దించడానికి వీలుగా అత్యున్నత పంప్‌ ఫ్లో లాంటివి ఉంటాయన్నారు.

పూర్తి ప్లాట్‌ ఫ్లాట్‌ఫామ్‌, సౌకర్యవంతమైన సీటింగ్‌, సమర్థవంతమైన నియంత్రణ, దీర్ఘకాలం క్షేత్రంలో పని చేసినప్పటికీ ప్రమాద రహిత డ్రైవింగ్‌ అనుభూతి వంటి సౌకర్యాలు, సమర్థతలు వీటిలో ఉన్నాయన్నారు. ఇవి 400 గంటల అత్యంత అధిక సర్వీస్‌ ఇంటర్వెల్‌ను అందిస్తాయన్నారు. ఈ నూతన ప్లాట్‌ఫామ్‌ కోసం రూ.300 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ముందుగా 73 ట్రాక్టర్లను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 70 వేల గంటల పాటుగా 40 అప్లికేషన్లతో 8 రాష్ట్రాల్లో పరీక్షించామని తెలిపారు.

ఓ ట్రాక్టర్‌ అభివృద్ధి క్రమంలో ఈ తరహా పరీక్షలు ఇన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ నూతన ట్రాక్టర్‌ ప్లాట్‌ఫామ్‌ను చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో అభివృద్ధి చేశారు. 57 హెచ్‌పీ తరహా అర్జున్‌ నోవో ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్‌, హైదరాబాద్‌). ఈ నూతన అర్జున్‌ నోవో 40కి పైగా కీలక వ్యవసాయ పనులు చేస్తుందని రవీంద్ర సహానె తెలిపారు. హైటెక్‌ ఫార్మింగ్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు.

మహీంద్రా అర్జున్ నోవో

మహీంద్రా అర్జున్ నోవో

వాహన తయారీ దిగ్గజం మహీంద్రా కంపెనీ హైదరాబాద్‌లో మంగళవారం తన కొత్త అర్జున్‌ నోవో ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది.

మహీంద్రా అర్జున్ నోవో

మహీంద్రా అర్జున్ నోవో

సంస్థ ట్రాక్టర్‌ అండ్‌ ఫామ్‌ మెకనైజేషన్‌ బిజినెస్‌ మార్కెటింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రవీంద్ర సహానె, సేల్స్ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ శర్మ తదితరులు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

మహీంద్రా అర్జున్ నోవో

మహీంద్రా అర్జున్ నోవో

ఈ సందర్భంగా రవీంద్ర సహానె మాట్లాడుతూ.. సాంకేతికంగా అత్యాధునిక రీతిలో, ఆకర్షణీయ శైలిలో అర్జున్‌ నోవో రూపుదిద్దుకుందని అన్నారు.

మహీంద్రా అర్జున్ నోవో

మహీంద్రా అర్జున్ నోవో

పూర్తి సరికొత్త అత్యున్నత హార్స్ పవర్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మొదటి మోడల్‌గా దీన్ని అభివర్ణించారు. ఇందులో 57 హెచ్‌పీ, 52 హెచ్‌పీ రెండు రకాలు లభిస్తాయన్నారు.

English summary

మార్కెట్‌లోకి కొత్త మహీంద్రా అర్జున్‌ నోవో(పిక్చర్స్) | Mahindra’s ‘Arjun Novo’ hits the road


 Mahindra and Mahindra on Tuesday launched its next generation tractor ‘Arjun Novo’, designed on an entirely new platform by Mahindra Research Valley, the company’s research facility in Chennai.
Story first published: Wednesday, September 3, 2014, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X