For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్దల పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు

By Nageswara Rao
|

Offshore retailers gain online market share
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారులు కూడా బాగా పెరిగారు. ఎంతలా అంటే ఈ రోజుల్లో ఏది కొనుగోలు చేయాలన్నా ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ షాపింగే బెస్ట్ అంటున్నారు. ఇలా ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై సుమారు డజనుకుపైగా ఆన్ లైన్ రిటైల్ సంస్దలపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది.

గత కొన్నేళ్లుగా ఈ రిటైలింగ్ బాగా జోరందుకోవడంతో ఆయా సంస్దల కార్యకలాపాలను అధ్యయన చేసే పనిలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం బిజినెస్ టు వినియోగదారుడు (బీటూసీ) విభాగంలో దేశీయ ఈ కామర్స్ కంపెనీల్లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు.

ఐతే బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ)లో మాత్రం 100% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తున్నారు. ఐతే కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈ రిటైలింగ్ సంస్దల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో, ఆయా కంపెనీలు భారీగా నిధులను సమీకరిస్తున్నాయి. దీంతో తొలిసారిగా ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆన్ లైన్ రిటైల్ సంస్దల కార్యకలాపాలపై దృష్టిని సారించాయి.

Read more about: money మనీ
English summary

ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్దల పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు | Offshore retailers gain online market share

Total online spending grew by 7 per cent in July, following a flat June, according to BNZ's latest online retail sales figures released today.
Story first published: Monday, September 1, 2014, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X