For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ అక్రమాలపై ఆర్‌బిఐ కొరఢా(పిక్చర్స్)

|

హైదరాబాద్: బ్యాంకుల అక్రమాలపై కొరడా ఝుళిపించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. బ్యాంకర్ల మోసాలకు తెరపడేలా అంబుడ్స్‌మన్ విచారణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు, షెడ్యూల్డ్ సహకార పట్టణ బ్యాంకులు తమ పరిధిలోకి వస్తాయని ఏపి, తెలంగాణ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్‌బిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అన్ని బ్యాంకులపై ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బ్యాంకు బ్రాంచీలలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పేరు, చిరునామా, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈ-మెయిల్ చిరుమానా కలిగిన డిస్‌ప్లే బోర్డులు ఉండాలన్నారు. ఈ తరహా బోర్డులను సంబంధిత బ్యాంకు వాళ్లే ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకులు అందించే సేవల్లో ఎలాంటి తప్పులు జరగకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ఏ బ్యాంకు వల్ల అయినా వినియోగదారులు మోసానికి గురైతే లేక బ్యాంకుల వల్ల ఏవైనా పొరపాట్లు జరిగితే తమకు (అంబుడ్స్‌మన్, హైదరాబాద్ ఫోన్ నెంబర్ 2321 0013, ఫ్యాక్స్ నెంబర్ 2321 0014) ఫిర్యాదు చేయవచ్చన్నారు.

రెండు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులన్నీ తమ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. 2013-14 సంవత్సరంలో తమకు 4,477 ఫిర్యాదులు అందాయని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య పెరిగిందని కృష్ణమోహన్ తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎస్‌బిఐ దాని అనుబంధ బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు అత్యధికంగా (44 శాతం) ఉన్నాయన్నారు. మెట్రోపాలిటన్‌లలో వచ్చిన ఫిర్యాదుల శాతం 43.71 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 31.07శాతంగా నమోదయ్యాయన్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల ఉందని వివరించారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్‌లో 2013-14 లో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య తగ్గిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో 29 శాతం ఫిర్యాదులు ఎటిఎం/డెబిట్/క్రెడిట్ తదితర కార్డులకు సంబంధించినవని చెప్పారు. ఫిర్యాదుల్లో క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపులు, ఇంటర్నెట్ అకౌంట్ల వినియోగంలో మోసం జరగడం, ఎటిఎంల నుంచి డబ్బు డ్రా చేసుకోవడంలో విఫలం కావడం తదితర అంశాలకు సంబంధించిన కేసులున్నాయ. తమకు (అంబుడ్స్‌మన్) అందిన ఫిర్యాదుల్లో గత సంవత్సరం అందిన 4,803 ఫిర్యాదులను (అంతకు ముందు సంవత్సరానికి సంబంధించిన 568 ఫిర్యాదులతో కలిపి) పరిష్కరించామన్నారు.

అక్రమాలపై కొరఢా

అక్రమాలపై కొరఢా

బ్యాంకుల అక్రమాలపై కొరడా ఝుళిపించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. బ్యాంకర్ల మోసాలకు తెరపడేలా అంబుడ్స్‌మన్ విచారణకు శ్రీకారం చుట్టింది.

అక్రమాలపై కొరఢా

అక్రమాలపై కొరఢా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు, షెడ్యూల్డ్ సహకార పట్టణ బ్యాంకులు తమ పరిధిలోకి వస్తాయని ఏపి, తెలంగాణ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు.

అక్రమాలపై కొరఢా

అక్రమాలపై కొరఢా

హైదరాబాద్‌లోని ఆర్‌బిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అన్ని బ్యాంకులపై ఉందన్నారు.

అక్రమాలపై కొరఢా

అక్రమాలపై కొరఢా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బ్యాంకు బ్రాంచీలలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పేరు, చిరునామా, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈ-మెయిల్ చిరుమానా కలిగిన డిస్‌ప్లే బోర్డులు ఉండాలన్నారు.

ఫిర్యాదులను పరిష్కరించేందుకు నిరుడు 697 సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. కస్టమర్ల హక్కులను రక్షించేందుకు తప్పు చేసిన బ్యాంకులపై 19 కేసుల్లో కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. సమాచార హక్కుల చట్టం కింద సమాచారం కోసం కూడా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగా కృష్ణానగర్, భద్రాచలంలలో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో ఏటా జరిగే ఎగ్జిబిషన్ సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రజాచైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వివరించారు.

ఎపిలో కొత్త ఆర్‌బిఐ శాఖ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త రాజధాని ఎక్కడా అన్న విషయం నిర్ణయిస్తే ఆర్‌బిఐ ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని బ్యాంకు రీజినల్‌ డైరెక్టర్‌ కెఆర్‌ దాస్‌ చెప్పారు. ప్లాస్టిక్‌ కరెన్సీని మార్కెట్లోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. మలేసియా, ఆస్ట్రేలియా, ఇప్పటికే ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టాయని చెప్పారు.

English summary

బ్యాంకింగ్ అక్రమాలపై ఆర్‌బిఐ కొరఢా(పిక్చర్స్) | RBI to check E-Bank frauds

Reserve Bank of India (RBI) has directed all the banks to keep a continuous tab on all electronic banking transactions, according to N Krishna Mohan, RBI Ombudsman of Telangana and Andhra Pradesh States.
Story first published: Thursday, August 28, 2014, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X