For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలరించిన నృత్యాలు: అపోలో ఈ-ఆక్సెస్(పిక్చర్స్)

|

హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హాస్పిటల్స్‌ తీవ్ర అనారోగ్యాలపాలై ఐసియుల్లో చికిత్స పొందుతున్న దూర ప్రాంతాల రోగులను ఆన్‌లైన్‌లోనే నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చికిత్సపై సలహాలు అందించే ఈ-యాక్సెస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అపోలో 26వ వార్షికోత్సవం సందర్భంగా శిల్పాకళా వేదికలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ-యాక్సెస్‌ను ప్రారంభించారు.

ప్రపంచంలో అత్యుత్తమ ఆస్పత్రిగా అపోలో ఎదగాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. మరిన్ని జిల్లాలకు అపోలో ఆస్పత్రి సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం వస్తే మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా హైదరాబాద్ నగర ప్రస్తుత జనాభా కోటి 20 లక్షలకు చేరుకున్నట్టు తేలడంతో ఇది చెన్నై, బెంగళూరు కంటే పెద్ద నగరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రోగులకు సమర్థవంతంగా వైద్యసేవలందించేందుకు తాము ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీలు ప్రవేశపెడుతున్నామని అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ-యాక్సెస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టామని, త్వరలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో రోబోటిక్‌ స్పైన్‌ సర్జరీని కూడా ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు. ఈ-యాక్సెస్‌ విధానం సుదూర ప్రాంతాల్లోని ఐసియు నిపుణులపై ఒత్తిడిని తగ్గించి రోగులకు స్వస్థత చేకూర్చడంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు.

తీవ్ర అనారోగ్యాల పాలై ఐసియుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్సలో తగు మార్పులు చేయాల్సి ఉంటుందని, కాని ఐసియు నిపుణుల కొరత వల్ల చాలా ఆస్పత్రుల్లో రోగులను సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఈ-యాక్సెస్‌ వ్యవస్థ ద్వారా అపోలోకు చెందిన ఐసియు నిపుణులు తమతో అనుసంధానమైన ఆస్పత్రుల్లోని ఐసియుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ ఐసియు సిబ్బందికి, వైద్యులకు తగు మార్గదర్శకం చేస్తారని ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.

ఈ-యాక్సెస్‌ సెంటర్‌లోని ఒక్కో నిపుణుడు 50 మంది రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగుల ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఐసియు సిబ్బందికి తగు సలహాలు ఇవ్వగలుగుతారని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఈ-యాక్సెస్‌ వ్యవస్థ 500 పడకలను పర్యవేక్షించగల సామర్థ్యం కలిగి ఉన్నదని, డిమాండును బట్టి దీన్ని వెయ్యి పడకల స్థాయికి పెంచుతామని ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీలను ఫిలిప్స్‌ సంస్థ అందించిందని ఆయన అన్నారు. కాగా, ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఆకట్టుకున్నాయి. సిఎం కెసిఆర్ వెంట డిప్యూటీ సిఎం రాజయ్య ఉన్నారు.

అపోలో

అపోలో

ఆరోగ్య సంరక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హాస్పిటల్స్‌ తీవ్ర అనారోగ్యాలపాలై ఐసియుల్లో చికిత్స పొందుతున్న దూర ప్రాంతాల రోగులను ఆన్‌లైన్‌లోనే నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చికిత్సపై సలహాలు అందించే ఈ-యాక్సెస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

అపోలో

అపోలో

అపోలో 26వ వార్షికోత్సవం సందర్భంగా శిల్పాకళా వేదికలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ-యాక్సెస్‌ను ప్రారంభించారు.

అపోలో

అపోలో

ప్రపంచంలో అత్యుత్తమ ఆస్పత్రిగా అపోలో ఎదగాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

అపోలో

అపోలో

మరిన్ని జిల్లాలకు అపోలో ఆస్పత్రి సేవలు అందించాలని కెసిఆర్ కోరారు. హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం వస్తే మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నారు.

అపోలో

అపోలో

చెన్నై,బెంగళూరు నగరాల కంటే ప్రస్తుతం హైదరాబాద్ పెద్ద నగరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

అపోలో

అపోలో

రోగులకు సమర్థవంతంగా వైద్యసేవలందించేందుకు తాము ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీలు ప్రవేశపెడుతున్నామని అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.

అపోలో

అపోలో

ఇందులో భాగంగానే ఈ-యాక్సెస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టామని, త్వరలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో రోబోటిక్‌ స్పైన్‌ సర్జరీని కూడా ప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు.

అపోలో

అపోలో

ఈ-యాక్సెస్‌ విధానం సుదూర ప్రాంతాల్లోని ఐసియు నిపుణులపై ఒత్తిడిని తగ్గించి రోగులకు స్వస్థత చేకూర్చడంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు.

అపోలో

అపోలో

తీవ్ర అనారోగ్యాల పాలై ఐసియుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్సలో తగు మార్పులు చేయాల్సి ఉంటుందని, కాని ఐసియు నిపుణుల కొరత వల్ల చాలా ఆస్పత్రుల్లో రోగులను సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారని ఆయన చెప్పారు.

అపోలో

అపోలో

ఈ-యాక్సెస్‌ వ్యవస్థ ద్వారా అపోలోకు చెందిన ఐసియు నిపుణులు తమతో అనుసంధానమైన ఆస్పత్రుల్లోని ఐసియుల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ ఐసియు సిబ్బందికి, వైద్యులకు తగు మార్గదర్శకం చేస్తారని ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.

అపోలో

అపోలో

ఈ-యాక్సెస్‌ సెంటర్‌లోని ఒక్కో నిపుణుడు 50 మంది రోగుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగుల ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఐసియు సిబ్బందికి తగు సలహాలు ఇవ్వగలుగుతారని ఆయన చెప్పారు.

అపోలో

అపోలో

ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఈ-యాక్సెస్‌ వ్యవస్థ 500 పడకలను పర్యవేక్షించగల సామర్థ్యం కలిగి ఉన్నదని, డిమాండును బట్టి దీన్ని వెయ్యి పడకల స్థాయికి పెంచుతామని ఆయన తెలిపారు.

అపోలో

అపోలో

ఇందుకు అవసరమైన టెక్నాలజీలను ఫిలిప్స్‌ సంస్థ అందించిందని ఆయన అన్నారు.

అపోలో

అపోలో

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఆకట్టుకున్నాయి. సిఎం కెసిఆర్ వెంట డిప్యూటీ సిఎం రాజయ్య ఉన్నారు.

అపోలో

అపోలో

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో ఆకట్టుకున్న కృష్ణ భగవాన్ నృత్యరీతులు.

English summary

అలరించిన నృత్యాలు: అపోలో ఈ-ఆక్సెస్(పిక్చర్స్) | Apollo's eAccess Services Launched

Hyderabad is a bigger city than Bangalore or Chennai and corporate hospital chains like Apollo Hospitals should scale up operations to meet the growing needs, chief minister K Chandrasekhar Rao has said.
Story first published: Thursday, August 28, 2014, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X