For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 100కే టిక్కెట్: ఎయిర్ ఇండియా వెబ్ సైట్ క్రాష్

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా డే సందర్బాన్ని పురుస్కరించుకోని రూ.100కే టికెట్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా సంస్ద వెబ్ సైట్ బుధవారం క్రాష్ అయింది. బుధవారం నుండి ఐదు రోజులపాటు రూ.100కే టిక్కెట్ ఆఫర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే వెబ్ సైట్ క్రాష్ అవ్వడం విశేషం.

జాతీయ విమానయాన సంస్ద ఎయిర్ ఇండియా రూ. 100కే విమాన టిక్కెట్లను అందించే ఎయిర్ ఇండియా ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ ఇండియా డే సందర్బంగా ఈ పరిమిత కాల ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో 2007, ఆగస్టు 7న ఎయిర్ ఇండియా విలీనమైన సంగతి తెలిసిందే. ఆరోజు నుండి ఆగస్టు 27ని ఎయిర్ ఇండియా దినోత్సవందగా జరపుతున్నారు. 2007లో విలీనమైన.. ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని ఏనాడు జరపలేదు. కానీ తొలిసారిగా ఎయిర్ ఇండియా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.

Air India Day

ఈ సందర్బంగా జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిర్ ఇండియా ఆఫర్‌లో భాగంగా రూ. 100కే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తున్నారు.

ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం ఈ ఆగస్టు 27 నుండి ఆగస్టు 31 వరకూ మాత్రమే బుక్ చేయాలని, ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 30 మధ్య జరిగే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా సూచించింది. ఈ ఆఫర్ పోందాలంటే ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.

English summary

రూ. 100కే టిక్కెట్: ఎయిర్ ఇండియా వెబ్ సైట్ క్రాష్ | 'Air India Day' Tomorrow, Tickets For Rs 100

National carrier Air India will celebrate tomorrow its merger with erstwhile Indian Airlines as 'Air India Day', offering tickets for Rs 100 for a limited period.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X