For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పారిశ్రామిక పాలసీ: సింగపూర్ వెళ్లిన కెసిఆర్

|

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సింగపూర్, కౌలాలంపూర్‌లలో నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఐఎం పూర్వ విద్యార్థులు సింగపూర్‌లో సమావేశం అవుతున్నారని, సింగపూర్ ప్రధానమంత్రి పాల్గొనే ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరికే ఆహ్వానం లభించింది.

పర్యటనకు వెళ్లడానికి ముందు తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ పర్యటనపై ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి సింగపూర్‌లో వివరిస్తానని చెప్పారు. మార్కెటింగ్ తెలంగాణ స్టేట్ నినాదంతో తన పర్యటన ఉంటుందని తెలిపారు. అవినీతి రహిత పాలన గురించి ప్రకటించినందున ఈ అంశంపై సింగపూర్ ఆసక్తి చూపినట్టు తెలిపారు.

 Big plans? KCR to market Telangana in Singapore, Kuala Lumpur

అవినీతి రహిత పాలనలో సింగపూర్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని కెసిఆర్ చెప్పారు. ‘సింగపూర్ నుంచి కౌలాలంపూర్‌కు కారులో వెళితే ఆ దేశంలో తాము సాధించిన అభివృద్ధిని చూడవచ్చు, తాము ఏం చేశామో చూడవచ్చునని ఆ దేశం తెలిపింది' అని కేసిఆర్ చెప్పారు. సింగపూర్ కన్నా మెరుగ్గా సింగిల్ విండో విధానంలో పరిశ్రమల విధానం ప్రకటించనున్నట్టు చెప్పారు.

కౌలాలంపూర్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని, అలాంటప్పుడు అభివృద్ధి ఏ విధంగా సాధించారో పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఆర్థిక మంత్రి ఈటెల, పారిశ్రామికవేత్తల బృందం ఉన్నారు.

English summary

పారిశ్రామిక పాలసీ: సింగపూర్ వెళ్లిన కెసిఆర్ | Big plans? KCR to market Telangana in Singapore, Kuala Lumpur

Chief Minister K. Chandrasekhar Rao on Tuesdsay night left for Singapore and Malaysia on a five-day trip where he will “showcase and market Telangana state.”
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X