For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్‌ల కేంద్రంగా రాజధాని: కెటిఆర్(పిక్చర్స్)

|

హైదరాబాద్: స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.

ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సరికొత్త ఆలోచనలు ఉండి నిధులు లేక సతమతమవుతున్న వారికి ఈ వేదిక అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు.

నిరుడు నిర్వహించిన ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా 400 నుంచి 500మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొనగా.. ఈసారి ఆ సంఖ్య మూడింతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండో ఎడిషన్ కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో లాభసాటిగా ఉండనుందని ఈట్ స్లిప్ డ్రింక్(ఈఎస్‌డి) సహ వ్యవస్థాపకుడు సురేష్ తెలిపారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు. మొదటి దశలో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌లో సుమారు 400 స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుంటుందని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు.

English summary

స్టార్టప్‌ల కేంద్రంగా రాజధాని: కెటిఆర్(పిక్చర్స్) | Aim is to make Hyderabad start-up capital of India: KTR

Bangalore may well have taken a march ahead of Hyderabad in Information Technology, but IT Minister K.T. Rama Rao on Wednesday said that the race to make Hyderabad the start-up capital of India is definitely on. 
Story first published: Thursday, August 14, 2014, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X